YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అమెజాన్ లో కొత్తగా 50 వేల ఉద్యోగాలు

అమెజాన్ లో కొత్తగా 50 వేల ఉద్యోగాలు

అమెజాన్ లో కొత్తగా 50 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ, మే 22,
కంపెనీలు, స్టార్టప్స్ వరుసపెట్టి ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు వారి ఉద్యోగ భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగాల కోతకు కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇక్కడ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది.అది కూడా వందల మందిని కాదు ఏకంగా వేలల్లో నియామకాలు చేపడతామని ప్రకటించింది. ఆ కంపెనీ మరేదో కాదు.. అమెజాన్ ఇండియా. అవును ఈ ఆన్‌లైన్ ఈకామర్స్ దిగ్గజం తాజాగా 50 వేల మంది సీజనల్ ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొంది. డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, డెలివరీ నెట్‌వర్క్ వంటి వాటిల్లో కొత్తగా నియామకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా తెలిపింది. అమెజాన్ ఫ్లెక్స్‌ కింద పార్ట్‌టైమ్ పనిచేయాలని భావించే వారు కూడా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ‘దేశవ్యాప్తంగా కస్టమర్లకు సహాయం చేయాలని భావించాం. వారికి అవసరమైన ప్రొడక్టులన్నింటినీ డెలివరీ చేయాలని నిర్ణయించాం. అందుకే 50,000 సీజనల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తున్నాం. దీంతో చాలా మంది ఉపాధి లభిస్తుంది’ అని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ (ఫుల్‌ఫిల్‌మెంట్ ఆపరేషన్స్) అఖిల్ సక్సెనా తెలిపారుఇకపోతే దేశంలో కోవిడ్ 19 వల్ల తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. దాదాపు అన్ని రంగాలు చతికిలపడ్డాయి. కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. ఇలాంటి ప్రతికూలతల్లో జొమాటో, స్విగ్గీ, ఓలా, షేర్‌చాట్, ఉయ్‌వర్క్ వంటి పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

Related Posts