YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత

ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత

ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత
విజయవాడ, మే 22
ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తేసింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెట్టింది.. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది.వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచారు.తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని.. తన 30 ఏళ్ల సర్వీసులో చిన్న ఆరోపణ లేదని.. అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30న తనను బదిలీ చేసి.. 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని.. జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ సమర్థించింది.. ఆయన వేసిన ట్రిబ్యునల్ కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది

Related Posts