YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలమూరు లో రియల్ బూమ్....!!!!

పాలమూరు లో రియల్ బూమ్....!!!!

మారాయి.కరవుజిల్లా పాలమూరులో భూములధరలకు రెక్కలొచ్చాయి.  రెండేళ్ల నుంచి స్తబ్తతగా ఉన్న భూములధరలు చుక్కలనంటుతున్నాయి.  పాలమూరుజిల్లాలోని పట్టణాల్లో రియల్‌బిజినెస్‌ ఊపందుకుంది. అమ్మకాలు కొనుగొళ్లతో రిజస్ట్రార్‌ ఆఫీసులు సందడిగా మారాయి.ఏకంగా రెండు నెల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం మూడు కోట్లు చేరింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఎగబడడంతో వ్యవసాయ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి.. అనేక ప్రాంతాల్లో పచ్చటి పొలాల్లో  వెంచర్లు వేస్తున్నారు. జిల్లాల పునర్విభజన కారణంగా నాగర్‌ కర్నూలు, వనపర్తి పట్టణాల్లో ఎపుడూలేని విధంగా స్థలాల రేట్లు ఆకాశాన్నంటాయి. గజం భూమి వేలల్లో పలుకుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట డివిజన్ కావడంతో రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేశారు. రియల్టర్ల మధ్య పోటి పెరిగి పట్టణంలోని శివారు ప్రాంతాలలో ఎకరా భూమి రూ. 60 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పలికిన ఎకరా భూమి జిల్లాల పునర్విభజన ప్రకటనతో పట్టణంలోని నాగర్‌కర్నూల్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ప్రాంతాలలో భూములకు రెక్కలు వచ్చాయి. పట్టణ శివారులోని శ్రీశైలం రహదారి అటవీశాఖ కార్యాలయం సమీపంలో, రోడ్లకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల వరకు రియల్టర్లు ఎకరాల కొద్ది భూములను విక్రయించి ప్లాట్లను చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ రోడ్డు జేఎంజే పాఠశాల, ఈద్గ, పోలిశెట్టిపల్లి గేటు వరకు రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేశారు. జేఎంజే పాఠశాల, ఈద్గ వద్ద గతంలో ప్లాట్లు చేసి అతి తక్కువ ధరకు విక్రయించారు. ప్రస్తుతం మిగిలిన ప్లాట్లు, కొనుగోలు చేసిన వారి నుంచి ఎంతకో అంతకు తిరిగి కొనుగోలు చేసి అట్టి ప్లాట్లకు రేట్లను మరింత పెంచి విక్రయిస్తున్నారు. గతంలో గజం 4నుంచి 5వేల రూపాయలు ఉండగా... కొత్త జిల్లాప్రతిపాదనతో నాగర్‌కర్నూలు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం గజం ధర ఏకంగా 20 నుంచి 40వేల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రెండు నెలల్లో భూవిక్రయాల ద్వారా సబ్‌రిజిస్ట్రార్‌ క్యార్యాలయాలకు ఏకంగా 3కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వచ్చిందంటే ..జిల్లాలో ల్యాండ్‌ బూమ్‌ ఎంతలా ఉందో అర్థమవుతోంది. అటు వనపర్తికూడా జిల్లాకేంద్రంగా మారుతుందన్న ప్రచారంతో రియల్‌వ్యాపారులు జోరుపెంచారు. వనపర్తితోపాటు పెబ్బేరు, కొత్తకోట, గోపాల్‌పేట వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈప్రాంతాల్లో ఎకరం పొలం 10లక్షల రూపాలకు పైమాటే అంటున్నారు స్థానికులు.

Related Posts