YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,39,904 మంది మృత్యువాత

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,39,904 మంది మృత్యువాత
 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,39,904 మంది మృత్యువాత
హైదరాబాద్‌ మే 23
కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల 39 వేల 904 మంది మృత్యువాతపడ్డారు కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్త దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 వేల 813. వ్యాధి నుంచి కోలుకుని 21 లక్షల 58 వేల 450 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.. ఈ వ్యాధి కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. యూఎస్‌ఏలో ఇప్పటివరకు 97,647 మంది చనిపోయారు. కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన వివిధ దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్‌-21,048, రష్యా-3,249, స్పెయిన్‌-28,628, యూకే-36,393, ఇటలీ-32,616, ఫ్రాన్స్‌-28,289, జర్మనీ-8,352, టర్కీ-4,276, ఇరాన్‌-7,300, పెరూ-3,244, చైనా-4,634, కెనడా-6,250, మెక్సికో-6,989, బెల్జియం-9,212, పాకిస్థాన్‌-1,067, నెదర్లాండ్స్‌-5,788, ఈక్వెడార్‌-3,056, స్వీడన్‌-3,925, స్విర్జర్లాండ్‌-1,903, పోర్చుగల్‌-1,289, ఐర్లాండ్‌-1,592, ఇండోనేషియా-1,326, రొమేనియాలో 1,166 మంది చనిపోయారు.

Related Posts