YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో

ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో

ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో
తుగ్గలి మే 23
మండల కేంద్రమైన తుగ్గలిలో అఖిల భారత యువజన సమైక్య జాతీయ సమితి పిలుపులో భాగంగా తుగ్గలి మండలం  లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు.తుగ్గలిలో ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై నిరసనను వ్యక్తం చేస్తూ వారు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి,ఆర్గనైజింగ్ కార్యదర్శి కారుమంచి,సొంటి పులి శేఖర్ లు మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ప్రభుత్వం వెంటనే పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని వారు తెలియజేసారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి యాజమాన్యమే జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు వారి స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకం వ్యవసాయ కూలీలకు కాకుండా,యంత్రాలకు పని కల్పిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తాలూక కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు మస్తాన్,పిరా తదితరులు పాల్గొన్నారు.

Related Posts