YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వరంగల్ బావి మిస్టరీ

వరంగల్ బావి మిస్టరీ

వరంగల్ బావి మిస్టరీ
వరంగల్, మే 23,
వరంగల్ సమీపంలోని గొర్రెకుంటలోని ఓ బావిలో 9 మృతదేహాలు లభ్యం కావడం మిస్టరీగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో మూడు మృతదేహాలు వారి పని చేసే గోడౌన్‌ సమీపంలోని పాడుబడ్డ బావిలో లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.వరంగల్ బావి నుంచి వెలికి తీసిన 9 మృతదేహాల వ్యవహారంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇవి ఆత్మహత్యలా లేదంటే హత్యలా అనే కోణం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న విచారణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మృతి చెందిన వారి ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కావడం.. మక్సూద్ ఫోన్ మాత్రం రాత్రి 9 గంటల వరకు ఆన్‌లోనే ఉండటంతో.. అతడిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మక్సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి నిర్వహించగా.. అందరూ కలిసి విందు చేసుకున్నారు. గురువారం తెల్లారేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం గాలించగా.. బావిలో నాలుగు శవాలు కనిపించాయి. శుక్రవారం మరో ఐదు శవాలను వెలికి తీశారు.మృతదేహాలను గుర్తించిన అనంతరం మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేయగా.. అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్న అతడి దగ్గర కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అందరి సెల్‌ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ కాగా.. మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడింది. మక్సూద్ భార్య, ఇద్దరు కుమారులతోపాటు... భర్తకు దూరంగా ఉంటున్న ఆయన కుమార్తె బుస్రా కూడా తన మూడేళ్ల కొడుకుతోపాటు వీరితోనే ఉంటోంది. ఇంతకు ముందు వారు కరీమాబాద్‌లో ఉండగా... లాక్‌డౌన్ కారణంగా రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. వారు పని చేసే గోడౌన్‌లో ఉన్న రెండు గదుల్లోకి మకాం మార్చారు. అదే గోడౌన్‌లో బిహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా నివాసం ఉంటున్నారు.సాయంత్రం ఆరు గంటలకు మక్సూద్ మినహా అందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏడు గంటలకి షకీల్ అనే వ్యక్తిని తన ఇంటికి రావాలని మక్సూద్ పిలిచినట్టు తెలుస్తోంది. రాత్రి 7.45 గంటలకు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. రాత్రి 9 గంటల సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల మధ్య ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది.మక్సూద్, ఆయన భార్య నిషా, కుమార్తె బూస్రాతోపాటు మూడేళ్ల బాలుడి మృతదేహాలను గురువారం బావిలో నుంచి వెలికి తీశారు. శుక్రవారం మరో మృతదేహం పైకి తేలడంతో.. బావిలో నుంచి నీటిని తోడేసి మక్సూద్ కుమారులు షాబాజ్, సోహిల్ మృతదేహాలతోపాటు గోనె సంచుల గోడౌన్‌కు వాహనాలను నడిపే డ్రైవర్ షకీల్.. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ల మృతదేహాలను వెలికి తీశారు.మసూద్ కూతురు బుస్రాకు వరంగల్‌లోని ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై బుస్రాకు ఆమె తల్లితో గొడవలు జరిగాయని.. దీంతో బుస్రాతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి వచ్చి ఘర్షణకు దిగాడని తెలుస్తోంది. ఇవి ఆత్మహత్యలే అయితే.. వీరితోపాటు డ్రైవర్‌, బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్‌ కూడా బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.వివాహేతర సంబంధం వల్లే వీరందర్నీ హత్య చేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరందరికీ ఆహారం విషం కలిపి ఇచ్చిన మక్సూద్.. స్పృహ కోల్పోయాక వారిని బావిలోకి విసిరేసి ఉంటాడని.. తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Related Posts