YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ లేకపోతే... 80 వేల మందిపైనే దుర్మరణం

లాక్ డౌన్ లేకపోతే... 80 వేల మందిపైనే దుర్మరణం

లాక్ డౌన్ లేకపోతే... 80 వేల మందిపైనే దుర్మరణం
న్యూఢిల్లీ, మే 23,
కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఒకవేళ కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించకపోయింటే దాదాపు 29 లక్షల మంది వైరస్ బారినపడేవారని కేంద్రం తెలిపింది.కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా విధించి దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల చాలా ప్రయోజనం చేకూరిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం వివిధ నమూనాలను వెల్లడించిన కేంద్రం.. లాక్‌డౌన్ విధించకపోయింటే దేశంలో ఇప్పటి వరకు 14-29 లక్షల మంది వైరస్ బారినపడి.. వీరిలో 37,000-78,000 మంది ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంది. లాక్‌డౌన్ మొదటి రెండు దశల విశ్లేషణల గురించి నీతి-ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకున్నాయని తెలిపారు.‘ఏప్రిల్ 03 నాటికి రోజుకు 22.6శాతం కొత్త కేసులతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.. కానీ, ఏప్రిల్ 4 తర్వాత కరోనా ఉద్ధృతి అమాంతం తగ్గి 5.5 శాతానికి చేరింది. మార్చి 25న సరైన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకున్నాం.. అంతేకాదు, లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి నిలిచింది.. ఇదే సమయంలో వైద్య సౌకర్యాలు, ఔషధాలు, కోవిడ్-19 స్పెషాలిటీ ఆస్పత్రులుతో పాటు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం, వెంటిలేటర్లు సమకూర్చుకోవడం, పీపీఈ కిట్ల తయారీ లాంటి అత్యవసర కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేసింది. తయారీ పరంగా భారత్ అన్నింటికంటే చాలా ముందుంది’అని వివరించారు.లాక్‌డౌన్ విధించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్- పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థికవేత్తలు, పరిశోధకులు రూపొందించిన నివేదికలను తెలియజేశారు. బీసీసీ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్ కారణంగా 36 నుంచి 70 లక్షల కేసులు, 1.2-2.1 లక్షల మరణాలు నివారించగలిగారని తెలిపింది. పిహెచ్‌ఎఫ్‌ఐ నివేదిక 78,000 మరణాలను నివారించినట్లు అంచనా వేసింది.

Related Posts