సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం
హైద్రాబాద్, మే 23,
టాలీవుడ్‌లో విషాదం నెలకుంది. సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠాత్తుగా గుండెపోటుతో శనివారం ఉదయం చనిపోయాడు. ఆయన వయసు 36 ఏళ్లు కాగా.. భార్య, పిల్లలు ఉన్నారు.సీనియర్ నటి వాణిశ్రీ ఇంట విషాదం నెలకుంది. ఆమె ఏకైక కుమారుడు హఠన్మారణం చెందాడు. చెన్నైలోని అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ (36) నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడు. చెన్నైలోని తన నివాసంలోనే అభయ్ మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన అభియన్ వెంకటేశ్, తర్వాత అదే కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. ఇటీవల తిరుక్కలికుండ్రంలోని ఓ బంగ్లాను అభినయ్ కొనుగోలు చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండటంతో గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటుంటున్నారు.ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారని సన్నిహితులు వెల్లడించారు. ఆ రోజు రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు తెలిపారు. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని చెబుతున్నారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, అభియన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. చెంగల్‌పట్టులోని ప్యాలెస్‌లో ఆత్యహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా అభినయ్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.అభినయ్ సతీమణి కూడా వైద్యురాలే కాగా.. ఆమె సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అభినయ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరుగుతాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభినయ్ మృతితో తెలుగు చలన చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి పలువురు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.70,80వ దశకంలో తెలుగు చిత్ర సీమలో కథానాయికగా ఓవెలిగిన కళాభినేత్రి వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌నే వివాహం చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు. వారు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక, వాణిశ్రీ వివాహం తర్వాత అత్త, తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండి తెర మీద కనిపించారు.