YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం విదేశీయం

చైనీస్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ తో చైనాపై ట్రంప్ చావుదెబ్బ

చైనీస్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ తో చైనాపై ట్రంప్ చావుదెబ్బ

చైనీస్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ తో చైనాపై ట్రంప్ చావుదెబ్బ
ఢిల్లీ మే 24. చైనా స్టాక్ మార్కెట్ ఇప్పటికే బిలియన్ డాలర్ల యుఎస్ పెన్షన్ నిధులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తరువాత, యుఎస్ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 చైనా కంపెనీలు వాటి అనుబంధ సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయబోతోంది. యుఎస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, చైనా కు చెందిన 7 కంపెనీలుతో పాటు మరో రెండు సంస్థను జాబితాలో చేర్చామని, ఎందుకంటే అవి చైనాలోని ఉగార్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలో భాగంగా చైనా ప్రభుత్వం చేసే పనులకు ఆ సంస్థు సహాయం చేస్తున్నట్లు నిర్ధారించినట్లు తెలిపింది.కరోనావైరస్ కారణం చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని కొనసాగిస్తున్నారు. అంతేకాదు పెద్ద సంఖ్యలో ప్రజలను నిర్బంధించి వారి శ్రమను బలవంతంగా దోచుకునేందుకు హైటెక్ టెక్నాలజీ సహాయంతో పర్యవేక్షించడంలో ఆ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహాయం చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. అంతే కాకుండా, చైనా సైన్యానికి వస్తువుల సరఫరా చేస్తున్న కారణంగా సుమారు రెండు డజన్ల ఇతర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అలాగే ఫేషియల్ రికగ్నిషన్ వంటి సాంకేతిక రంగాలలో సేవలు అందిస్తున్న కంపెనీలు ఈ బ్లాక్ లిస్టులో ఉన్నాయి. ఇంటెల్ కార్ప్, ఎన్విడియా కార్ప్ సహా అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు ఈ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి.బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలలో నెట్‌పోసా అనే అతి పెద్ద చైనీస్ AIసంస్థ కూడా ఉంది, ఈ సంస్థ కింద పనిచేసే అనుబంధ సంస్థలు వ్యక్తులను ముఖకవళికలను పర్యవేక్షిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని ట్రంప్ నొక్కి చెప్పారు. అమెరికా దీనిని తేలికగా తీసుకోబోదని అన్నారు. "కరోనా వైరస్ చైనా నుండి వచ్చింది" అని ట్రంప్ మిచిగాన్‌లో ఆఫ్రికన్ అమెరికన్ నాయకులతో జరిగిన భేటీ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో తాము సంతోషంగా లేమని. వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధంగా చైనా నడుస్తోందని ఆరోపించారు. అయితే, చైనాకు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోవాలో అమెరికా అధ్యక్షుడు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు

Related Posts