గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి ఫై దాడి...
చిత్తూరు జిల్లా మే 24. గంగవరం మండలం... రెంటకుంట్లలో వైసీపీ నేత... గ్రామ వలంటీర్‌పై దాడికి దిగినట్లు తెలిసింది. అసభ్య పదజాలంతో ఇష్టమొచ్చినట్లు తిట్టి.... సౌమ్య అనే బాధిత వాలంటీర్‌పై సావిత్రమ్మ దాడి చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా 50 ఇళ్లలో ప్రజలకు రకరకాల ప్రభుత్వ పథకాల్ని చేరవేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న శాలరీ చాలా తక్కువే అయినప్పటికీ బండెడు బాధ్యతల్ని మోస్తూ... వారు ప్రభుత్వ పాలనకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. అలాంటి వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా కొంత మంది వారిపైనే దాడులకు దిగుతుండటం ఆందోళనకర అంశం తనకు న్యాయం చెయ్యాలంటూ... అధికారులు, పోలీసుల్ని ఆశ్రయించింది గ్రామ వలంటీర్ సౌమ్య. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇదీ పరిస్థితి. నీతి నిజాయితీతో మెలిగే ఉద్యోగులపై కొంత మంది పనికిమాలిన నేతలు బెదిరింపులు, దాడులకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.