YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రేపటి చంద్రబాబు పర్యటనకు తెలంగాణ డీజీపీ అనుమతి .. ఏపీ డీజీపీ నిరాకరణ

ఏపీలో రేపటి చంద్రబాబు పర్యటనకు తెలంగాణ డీజీపీ  అనుమతి .. ఏపీ డీజీపీ నిరాకరణ

ఏపీలో రేపటి చంద్రబాబు పర్యటనకు తెలంగాణ డీజీపీ
 అనుమతి  ఏపీ డీజీపీ నిరాకరణ
ఏపీలో పర్యటనపై నిన్ననే రెండు రాష్ట్రాల డీజీపీలకు చంద్రబాబు లేఖలు రాయగా... తెలంగాణ డీజీపీ వెంటనే అనుమతి ఇచ్చారు. అయితే అనుమతి కోసం ఏపీ డీజీపీకి ఇప్పటికే చంద్రబాబు రెండు లేఖలు రాశారు.  రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతికి అనుమతి కోరుతూ ఒక లేఖ రాయగా, హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి బాధితుల పరామర్శ అనంతరం రోడ్డు మార్గంలో విశాఖ నుంచి అమరావతికి అనుమతి కోరుతూ మరో లేఖ రాశారు. కాగా ఈ రెండు లేఖలపైనా ఏపీ డీజీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది.రాష్ట్రంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి పర్యటనపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు పర్యటనకు ఏపీ డీజీపీ అనుమతి నిరాకరించారు. 

Related Posts