YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పరమాత్మలో ఐక్యత సాధ్యమా?

పరమాత్మలో ఐక్యత సాధ్యమా?
పరమాత్మలో ఐక్యత సాధ్యమా?
పరమాత్మ ఎవరు? ఎక్కడ ఉంటాడు? పరమాత్మను ఆత్మ పొందుతుందా? జీవాత్మ పొందుతుందా.......?
పరమాత్మ
సృష్టికి పూర్వం ఒకే ఒక పదార్ధం వుంది అదియే శక్తి, అదియే పరమాత్మ. సృష్టి జరిగినపుడు ఆ శక్తే ప్రకృతిగా మారింది. అంటే బంగారం నుండి మనం వేరే వేరే నగలను ఎలా తాయారు చేస్తామో వాటిని అన్నిటిని కరిగిస్తే తిరిగి బంగారం అవుతుంది. అదేలాగు ఈ సృష్టి కూడ పరమాత్మలోనే వుంది. అంతే కాని పరమాత్మ వేరే ఎక్కడో లేడు. అంటే ఇప్పుడు ఒక నీటి కొలను వుంది అనుకోండి. ఆ నీటి కొలనులో నీటి బుడగలు వస్తాయి మరల అవి నీల్లగా మారి అందులోనే కలిసిపోతాయి. అదేవిధంగా పరమాత్మలోనే సృష్టి అంతా వుంది. దీనినే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునడికి... అర్జునా సమస్తం నాలోనే వుంది అని చెప్తాడు.పరమాత్మా అంటే అనంత సాగరం. అందులోనే మనం వున్నాము.
ఆత్మ :
ఆత్మ అంటే పరమాత్మనే. అదేలాగు అంటే సృష్టి జరిగిన తరువాత పంచ భూతాలతో నిర్మితమైన ఈ నిర్జీవ పదార్థానికి (శరీరానికి) శక్తి ఆత్మే అది ఇందులో వుంది. అయితే ఆత్మే పరమాత్మ ఎలాగు అంటే ఒక సముద్రము నుండి ఒక నీటి బొట్టును పక్కకు తీస్తే అది సముద్రపు నీటికి ఎలా సమానమో అదేలాగో ఆత్మ కూడా పరమాత్మనే. అయితే ఆత్మ ఏమి చేయుట లేదు. ఎలాగంటే మనం ఒక ఇంట్లో ఉంటాము మనం ఒక క్రొవ్వత్తి వెలుగు ద్వార మనం పని చేసుకుంటాము అంటే ఇక్కడ క్రొవ్వత్తి ఏమి పని చేయుటలేదు అదేలాగ ఆత్మ యొక్క శక్తి చేత శరీరము, మనస్సు మరియు బుద్ది పని చేసుకోనుచున్నవి. ఆత్మ యొక్క తత్వాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చాల విపులంగా వర్ణించాడు.
జీవాత్మ:
జీవాత్మ అంటే మనం అహంకారంతో, అజ్ఞానంతో మరియు అవిద్యతో సత్యాన్ని తెలియక నేను అనే అహంకారంతో ప్రోగు చేసుకున్న కర్మలు మరియు ఆత్మను కలిపి జీవాత్మ అని అంటాము.ఇందులో ప్రోగు చేసుకున్న కర్మలకు ఆత్మకు ఎటువంటి సంబందము ఉండదు. అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలు తొలిగిపోవడానికి మనం కర్మలు చేస్తూ వుంటాము. వీటి వేటితో కూడా ఆత్మకు సంబందము ఉండదు. నీవు నిజానికి ఆత్మవే. కానీ అజ్ఞానంలో మనం సత్యాన్ని మరచిపోయాము. అందుకే గురువులు అంటారు, మీరు అంతా మరుపులో ఉన్న దేవతలు అని.
పరమాత్మలో ఐక్యం:
ఎప్పుడైతే మనం అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకుంటామో అప్పుడు మనం అయిన ఆత్మలు ఈ అనంత సాగరమైన పరమాత్మలో విలీనం అవుతావు.
అయితే మనం మన శరీరపు కండ్లతో చూసేది కాదు. దానిని (ఆత్మను) చూడాలంటే సాధన (ధ్యానం) చేసి మన హృదయంలో సాక్షాత్కరించుకోవాలి.అంటే ఆ అనుభూతి మన మనస్సుకి మాత్రమే తెలుస్తుంది అది వర్ణింపనలవి కానిది. అప్పుడు శరీరం ఉన్నపుడే మనం ముక్తులము అవుతాము
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts