ఓ మహాప్రభో..!!
నీ బలం నుండి దేవేంద్రుడూ,
నీ అనుగ్రహం నుండి దేవతలూ,
నీ ఆగ్రహం నుండి రుద్రుడూ,
నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడూ,
నీ ఇంద్రియాల నుండి వేదాలూ, మునులూ,
నీ పురుషాంగం నుండి ప్రజాపతీ,
నీ రొమ్ములనుండి లక్ష్మీదేవీ,
నీ నీడ నుండి ధర్మమూ,
నీ వీపు నుండి అధర్మమూ,
నీ తల నుండి స్వర్గమూ,
నీ నవ్వు నుండి అప్సరసలూ,
నీ ముఖం నుండి బ్రాహ్మణులూ, బ్రహ్మమూ,
నీ భుజాల నుండి రాజులూ, బలమూ,
నీ తొడలు నుండి వైశ్యులూ, నేర్పరితనమూ,
నీ పాదాల నుండి శూద్రులూ, శుశ్రూషా,
నీ క్రింద పెదవి నుండి లోభమూ,
పై పెదవి నుండి ప్రేమా,
నీ ముక్కుపుటాల నుండి కాంతీ,
నీ స్పర్శ నుండి కామమూ,
నీ కనుబొమలు నుండి యముడూ,
నీ ప్రక్కభాగం నుండి కాలమూ సంభవించాయి,
నీ యోగమాయ వలన ద్రవ్యమూ, వయస్సూ, కర్మమూ, గుణవిశేషాలూ విధింపబడ్డాయి,
నీ ఆత్మతంత్రం నుండి ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ కలిగాయి,
నీ వలన లోకాలూ, లోకపాలకులూ ఏర్పడి అభివృద్ధి పొందుతారు,
దేవతలకు ఆయుస్సూ, ఆహారమూ, బలమూ నీవే,
పర్వతాలపై అధికారి నీవే,
ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే,
సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే,
మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మం నీవే,
చావు బ్రతుకులు నీ రూపాలే,
ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే,
తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు, పరమశక్తివైన మహాప్రభూ! మాపై దయచూపు.
కృష్ణం వందే జగద్గురుమ్

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో