*మనిషి ఆరోగ్యంగా - మనసు ఆనందంగా వుండాలంటే*
నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయంతో, అంతులేని ఆశలతో, అర్థంకానీ, అర్థం లేని ఆవేదనలతో కానిదానికై, రానిదానికై ప్రాకులాడే మానవునికి సరైన మార్గంను చూపేది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే!
దేహమును జలంతో శుభ్రం చేసుకున్నట్లుగా మనస్సును జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలి...
అంతః శుద్ధి లేకుండా దినమునకు పది పర్యాయములు స్నానము చేసినంత మాత్రమున దైవత్వము ప్రాప్తిస్తుందా!?
శరీర అవసరమునకు, బలమును చేకూర్చుట కొరకును మనం మూడు పూటలు ఆహారం భుజిస్తున్నాము కదా,
మరి మనసుకు బలము చేకూర్చుటకు ఏమి అందిస్తున్నాం!?
దేహమునకు మూడు పూటలా తిండి ఎలానో మనసుకు కూడా మూడు సంధ్యలలో బలాన్ని అందించాలి.
ఉదయం లేచిన తక్షణమే భగవన్నామం స్మరించాలి....
భగవంతుని రూపాన్ని ధ్యానించాలి...
తీరిక లేని ఎంత గొప్ప పనిలో ఉన్నాసరే మద్యాహ్నం, సాయంత్రం కూడా తప్పని సరిగా భగవంతుణ్ణి స్మరించి తీరాలి...
*అపుడే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి ఆనందంగా ఉంటుంది...*
*శుభమస్తు*
సమస్త లోకా సుఖినోభవంతు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో