YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*ఆధ్యాత్మిక ప్రగతి....*

*ఆధ్యాత్మిక ప్రగతి....*
*ఆధ్యాత్మిక ప్రగతి....*
ఈ క్రింది నియమాలను తెలుసుకుని వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా పరిపూర్ణత ను సాధించ గలం.    
  ఒకానొక సందర్భం లేదా సంఘటన నీకు ఎదురైతే ఆ పరిస్థితి నుంచి నువ్వు నేర్చుకోవలసిన జ్ఞానాన్ని..... నేర్చుకునేంతవరకూ...అదే సంఘటన పదే పదే నీకు ఎదురౌతుంది.
నిన్ను నీవు ఆద మరిచేంతలా... నువ్వే నీ అన్ని ఆలోచనలను నీ స్వాధీన పరచుకో గలిగే శక్తి... స్వతః సిద్ధంగా నీ దగ్గరే ఉంది.
ఎప్పుడైతే నీ మనస్సులో ప్రశ్నలు సమాధానాలు అంతరించి పోతాయో అప్పుడు నీవు ఎదుగు తున్నావని అర్థం...                                                                                                                                                         
నీ పట్ల, ఇతరుల పట్ల, నీ పూర్ణాత్మ పట్ల, నీ సృష్టి పట్ల, నీ మనసులో ఎలాంటి ఆరోపణలు (Complaints) ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆపే అడ్డంకులే ఈ ఆరోపణలు.             
  ఆత్మ నీరులా, మనస్సు-మంచు, గడ్డలా ఉంటుంది. నీరు అన్నింటి తోనూ కలిసి పోతుంది, కాని మంచు- గడ్డ  విభేదిస్తుంది. అందు వలన ముందుగా ఏర్పరచుకున్న స్థిర అభిప్రాయాలను కలిగి ఉండరాదు.                         
 ప్రతి విషయాన్ని, పరిస్థితులను, మనుషులను నీవు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం, అనగా నేను సరిగా... అందరూ సరి సమంగా... అంతా సరి- గానే...ఉన్నది అన్న భావన లో ఉండాలి.                   
 మీ దాన ధర్మాలు వెనుక ఉన్న ఉద్దేశం... స్వార్ధపూరితమైతే.... మీరు ఎన్ని దానాలు చేసినా నిష్ర్పయోజనమే.        ఇతరులతో మనం పోల్చుకుంటే మనల్ని మనం పోగొట్టుకున్నట్లే. మన జీవితంలో కష్టాలు అనేవి ఇతరులతో పోల్చుకోవడం వల్లనే వస్తున్నాయి.                     
  గర్వం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కిందకి తోస్తుంది. గర్వించ దగినది. ఏదైనా దేవుడు మనకిస్తే వినయంగా ఉండండి. గర్వం స్వార్ధానికి సంబంధించినది.         
 'ప్రతీకారం'' అనేది ఆధ్యాత్మికతను భంగ పరుస్తుంది. ప్రతీకారానికి బదులుగా మీరు క్షమా గుణాన్ని అలవరచు కోవాలి. సరికాని వ్యక్తుల తో స్నేహ సంబంధాన్ని కలిగి ఉండటం వలన వారి కర్మల లో భాగం పంచుకుంటావు.
   నేను" అనేది వచ్చిందంటే నీ ఆధ్యాత్మిక పతనానికి మొదటి-దశ-అని- గుర్తించు. ఈ విధంగా గుర్తించి అంగీకరించడం వలన నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు.     
భూలోకంలో నీవు నీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయక పోతే భూమి మీద నీవు ఏది సాదించినా.. నీ జీవితమనే వరం. నీ ప్రయాణంను పూర్తవ నివ్వదు...!
 జీవిత సత్యాన్నీ ధ్యాన మార్గం ద్వారా
ప్రతీ ఒక్కరూ తెలుసు కోగలిగితే.నరుడే నారాయణుడు కాగలడు
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో

Related Posts