YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

*దేశీయంగా ప్రయాణానికి మార్గదర్శకాలు (విమానాలు / రైళ్లు/ ఇంటర్-స్టేట్ బస్సు ప్రయాణాలు)*

*దేశీయంగా ప్రయాణానికి మార్గదర్శకాలు (విమానాలు / రైళ్లు/ ఇంటర్-స్టేట్ బస్సు ప్రయాణాలు)*

*దేశీయంగా ప్రయాణానికి మార్గదర్శకాలు (విమానాలు / రైళ్లు/ ఇంటర్-స్టేట్ బస్సు ప్రయాణాలు)*
దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ ఈనెల 31వరకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సడలింపులు ఇచ్చింది.
మన రాష్ట్రంలో అయితే ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
పలు ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి. 25వ తేదీ నుంచి దేశీయంగా విమానాలు సర్వీసులు  తిరగడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో విమానాలు, రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేవారికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులంతా వీటిని పాటించాలని సూచించింది.
•       విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలు తెలిసేలా సంబంధిత ట్రావెలింగ్ ఏజెన్సీలు లేదా సంస్థలు టికెట్ వెనుక ముంద్రించాలి.
•       ప్రయాణాలు చేసే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి

•       కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇతర విధివిధానాలను ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో తప్పక అనౌన్స్ మెంట్ రూపంలో ప్రచారం చేయాలి.
•       రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రయాణికులందరూ బయలుదేరడానికి ముందే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం / రైలు / బస్సులు ఎక్కడానికి అనుమతించాలి.
•       బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి.
•       బస్టాండు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లలలో తప్పని సరిగా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
•       విమానాశ్రయాలు / రైల్వే స్టేషన్లు / బస్ స్టేషన్లలో క్రమంతప్పకుండా శానిటైజేషన్ / క్రిమీసంహారక ద్రావణంతో శుభ్రంచేయాలి. సబ్బులు, శానిటైజర్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి.
•       బయటకు వెళ్లే ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
•       కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణీకులు 14 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలి. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు తెలియజేయాలి.
•       పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న కరోనా చికిత్స కేంద్రానికి తరలించాలి. వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.
•       తేలికపాటి లక్షణాలు ఉన్నవారు తగిన సౌకర్యాలు ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఐసిఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం కోవిడ్ కేర్ సెంటర్లలో (ప్రభుత్వ మరియు ప్రైవేట్ సౌకర్యాలు రెండూ) అందుబాటులో ఉంటాయి.
పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐసిఎంఆర్ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ కేర్ సెంటర్లో పరీక్షించబడతారు.
•   ఒకవేళ నెగిటివ్ రిపోర్టు వస్తే అతడు / ఆమె ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండేందుకు అనుమతిస్తారు. ఆసమయంలో మరోసారి ఏమైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
*సూచన: ఆయా రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కు సంబంధించిన ప్రొటోకాల్స్  రూపొందించుకోవచ్చు.

డాక్టర్. అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

Related Posts