YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పోతిరెడ్డిపాడు..సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు

పోతిరెడ్డిపాడు..సమస్యకు  పరిష్కారం దిశగా అడుగులు

పోతిరెడ్డిపాడు..సమస్యకు  పరిష్కారం దిశగా అడుగులు
హైద్రాబాద్, మే 25,
పోతిరెడ్డిపాడు వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని అపెక్స్ కమిటీ ముందు హాజరుకాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్  ఆల్టర్నేట్ ఆలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. వివాద పరిష్కారానికి నేరుగా ఏపీ సీఎం జగన్ తో మాట్లాడేందుకు ఆయన చొరవ చూపే  అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా త్వరలో జగన్ ను మళ్లీ ప్రగతి భవన్ కు పిలువొచ్చని చెబుతున్నారు. రెండోసారి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక, ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేశాక ఇంతవరకు రెండు రాష్ట్రాలు నదీ జలాల విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలు మాత్రమే ఫిర్యాదు చేశాయి. అపెక్స్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఇద్దరు సీఎంలు జల వివాదంపై కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేయనప్పుడు.. కేంద్రమే ఎజెండా అడగడం ఏమిటని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు అంటున్నారు.పోతిరెడ్డిపాడు కెపాసిటీని డబుల్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రయత్నిస్తున్నదంటూ ఇటీవల రాష్ట్ర బీజేపీ  కేంద్ర ప్రభుత్వానికి  ఫిర్యాదు చేసినందున అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని చైర్మన్ హోదాలో  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అపెక్స్ కమిటీకి ఎజెండా పంపాలని ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసింది. దీనికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎజెండాను పంపాల్సి ఉంది. ఆ ఎజెండాను బట్టి సమావేశం జరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ వద్ద కొందరు సీనియర్ అధికారులు ప్రస్తావించినప్పుడు ‘‘ఎజెండా పంపేందుకు తొందరేం లేదు. కొన్ని రోజులు ఆగండి. ఏం చేయాలో చెప్తా’’ అని ఆయన అన్నట్టు తెలిసింది. అయితే.. పోతిరెడ్డిపాడు వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పరిష్కరించుకునే బదులు ఇక్కడే  పరిష్కరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో జగన్ను ప్రగతిభవన్కు పిలిచి.. వివాదంపై సీఎం కేసీఆర్ డిస్కషన్ చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు.
 

Related Posts