రైల్వే రిజర్వేషన్లు... షురూ...
సికింద్రాబాద్, మే 25,
లాక్ డౌన్ కారణంగా అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. వలస కార్మికుల కోసం రైల్వేశాఖ శ్రామిక్ రైళ్ళు నడుపుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైలు సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల రిజర్వేషన్ కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీకి సంబంధించి 52 రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో ఉంచిన టిక్కెట్లు శుక్రవారం గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే 200 రైళ్లలో ఏపీకి, ఏపీ మీదుగా ప్రధానంగా ఐదు రైళ్లు వెళ్లనున్నాయి. టిక్కెట్ కన్ఫర్మ్ అయితేనే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ఈ రైళ్లకు జనరల్ బోగీలు ఉండవు. మొత్తం రిజర్వ్‌డ్ బోగీలతోనే నడుస్తాయి. రెండుగంటల ముందే ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. వారిని పరీక్షించిన తరవాతే కోచ్ లలోకి అనుమతిస్తారు. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని 30 రోజులకు పెంచింది. ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ను విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. టికెట్లను ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని రైల్వే తెలిపింది. ఏపీలో రిజర్వేషన్ కౌంటర్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్ జంక్షన్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, అనంతపూర్, ధర్మవరం స్టేషన్లలో మాత్రమే స్పెషల్ ట్రైన్స్‌కు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. తెలంగాణలో రిజర్వేషన్ కౌంటర్లుసికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట, మహబూబ్‌నగర్, రైల్వే స్టేషన్లు