YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

మారిషస్ చేరిన భారత నౌక

మారిషస్ చేరిన భారత నౌక

మారిషస్ చేరిన భారత నౌక
ముంబాయి మే 25
మిషన్ సాగర్లో భాగంగా నేవీ షిప్ కేసరి మారిషస్ లోని పోర్ట్ లూయిస్కు చేరుకుంది. అత్యవసర వైద్య సామాగ్రి, వైద్య సభ్యుల బృందం,10 టన్నుల ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. మిషన్ సాగర్లో భాగంగా భారతీయ నావల్ షిప్ కేసరి మారిషస్లోని పోర్ట్ లూయిస్కు చేరుకుంది. ప్రభుత్వం తరఫున మారిషస్ ఆరోగ్య శాఖా మంత్రి ఖైలేష్ జగత్పాల్ ఈ కన్సైన్ మెంటును రిసీవ్ చేసుకున్నారు. ఈ షిఫ్ మెంట్లో పది టన్నుల ఆయుర్వేద మందులతో పాటు, భారతీయ మెడికల్ అసిస్టెంట్ టీం, ఒక కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుడు, పల్మోనాలజిస్ట్ మరియు ఒక అనస్థీషియనిస్ట్ ఉన్నారు.పోర్ట్ లూయిస్ నౌకాశ్రయంలో వీటిని భారత హైకమిషనర్ తన్మయ లాల్, మారిషస్ ఆరోగ్య మరియు సంరక్షణ మంత్రి డాక్టర్ కైలేష్ జగుత్పాల్ కు అందజేశారు. మొదటి విడతగా13 టన్నుల అవసరమైన వైద్య సామాగ్రి ఏప్రిల్ 15 న భారత్ నుండి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మారిషస్కు చేరుకుంది. మారిషస్ ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు ఈ మందుల సరఫరాను,  వైద్య సహాయ బృందాన్ని భారత ప్రభుత్వం పంపించింది.

Related Posts