YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మొదటిరోజే సమాచార లోపం మండిపడ్డ ప్రయాణికులు

మొదటిరోజే సమాచార లోపం మండిపడ్డ ప్రయాణికులు

మొదటిరోజే సమాచార లోపం
మండిపడ్డ ప్రయాణికులు
హైదరాబాద్ మే 25
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈరోజు డొమెస్టిక్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.. లాక్ డౌన్ తో ఇన్ని రోజుల పాటు ఆగిపోయిన విమానాలు తిరిగి టేకాఫ్ అయ్యాయి.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి మాత్రమే విమాన సర్వీసులు నడిచాయి.. కానీ ఈరోజు నుంచి పూర్తి స్థాయి డొమెస్టిక్ ప్యాసింజర్ సర్వీసులు స్టార్ట్ చేశారు. రెగ్యులర్ గా నడిచే డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో 30శాతం నడిపించాలని కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.. దీనిలో భాగంగా ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 36 సిటీస్ కి 120 డొమెస్టిక్ సర్వీసులను షెడ్యూల్ చేశారు.. ఇందులో విమానాలు డిపార్చర్ కాగా 60 విమానాలు అరైవల్ నడపాలని అనుకున్నారు.. కానీ కొన్ని రాష్ట్రాలు సర్వీసులు తగ్గించాలని కోరడంతో ఇందులో 75శాతం సర్వీసులు రద్దు చేశారు. 15 డిపార్చర్ ఫ్లైట్స్ అండ్ 15 అరైవల్ ఫ్లైట్స్ మాత్రమే నడిచాయి. సోమవారం  ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 5గంటలకు లక్నోకి మొదటి ఫ్లైట్ షెడ్యూల్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయింది.. ఉదయం 8గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ నుంచి కర్ణాటక లోని విద్యానగర్ కి ట్రూజెట్ విమానం టేకాఫ్ అయింది.. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలియక చాలా మంది ప్యాసింజర్స్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి తిరిగి వెళ్లారు.. విమానాల రద్దుకు సంబంధించిన ఎయిర్ లైన్ కంపెనీస్ తమకు ఎలాంటి మందస్తు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇక కరోనా సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ని తగ్గించారు.. ఎయిర్ పోర్ట్ లో మొత్తం 85 సెన్సార్ సానిటైజర్ మిషన్లు ఏర్పాటు చేశారు.  ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.. ఎయిర్ పోర్ట్ ఎంట్రీ గేట్స్ దగ్గర ఐడీ కార్డును సెక్యూరిటీ సిబ్బందికి డైరెక్ట్ గా చూపించకుండా కెమెరా ద్వారా చెక్ చేస్తున్నారు.. ప్రతీ ప్యాసింజర్ టెంపరేచర్ ని చెక్ చేస్తున్నారు.. ఫిజికల్ డిస్టేన్స్ కోసం స్పెషల్ గా స్టిక్కరింగ్ చేశారు.  ప్రయాణీకులందరూ తమ సెల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం కూడా తప్పనిసరి.. ఒకవేళ యాప్ లేనట్లైతే వారి ఫోన్లలో అక్కడిక్కడే డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎయిర్ ట్రావెల్ సిబ్బంది సహాయం చేస్తారు.  ప్రతీ ప్యాసెంజర్ ఫ్లైట్ టైమ్ కన్నా రెండు గంటలు ముందుగా ఉండాలి.. లగేజ్ కూడా వీలైనంత తక్కువగా తీసుకెళ్లాలని సూచించారు అధికారులు.

Related Posts