తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలి
విజయనగరం మే 25
విజయనగరం జిల్లాలో లాక్ డౌన్ సమయం లో అక్రమ వసూళ్లకు పాలప్పాడంటూ సాలూరు ఎం అర్ ఓ అక్రమాలు బయట పడ్డాయి. దీంతో ఎం అర్ ఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తూ ఎం అర్ ఓ ను సస్పెండ్ చేయాలని జనసేన నాయకులు ధర్నాకు దిగారు. పేదల ఇళ్లస్థలాలు విషయంలో అవినీతికి పాల్పడి, లోక్డౌన్ సమయంలో వర్తకులును బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడి అవినీతికి పాల్పడుతున్న విజయనగరం జిల్లా సాలూరు మండల తహసిల్దార్ ను వెంటనే విధుల నుండి తొలిగించాలని, అతనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు కార్యాలయం కూడలిలో ధర్నా నిర్వహించారు. వివరాలలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలకు ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి సాలూరు రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారని వారు ఆరోపించారు. సాలూరు పట్టణప్రజాలకు 8 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి సదుపాయములు లేని చోట ఎకరా లక్ష రూపాయలు కూడా విలువ చేయని డి పట్టా భూములను 11 లక్షలకు కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని.అంతే కాకుండా లోక్డౌన్ సమయంలో పట్టణంలో గల దుకాణాలకు సీలు వేసి వర్తకులు నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసారని ఇటువంటి అవినీతి తహశీల్ధార్ ను వెంటనే సస్పెండ్ చేసి అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యుటీ తహశీల్ధార్ లి వినతి పత్రం అందించారు.