ఆదిలాబాద్ : పెన్ గంగ నది పై నిర్మిస్తున్న చెనక కొరట బ్యారేజ్ నిర్మాణ పనులను మంత్రి జోగు రామన్న సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని కాంట్రాక్టర్ కు సూచించారు. దాంతోపాటు కూలీల సంఖ్య పెంచాలని చెప్పారు. పంప్ హౌస్ పనులను కుడా మంత్రి పరిశీలించారు. అక్కడ సైతం నత్తనడకన సాగుతున్న పనుల పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.