YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కన్నాపై నెటి జన్ సెటైర్లు

కన్నాపై నెటి జన్ సెటైర్లు

కన్నాపై నెటి జన్ సెటైర్లు
గుంటూరు, మే  26,
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. అతిపెద్ద జాతీయ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆ రేంజ్‌లో రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్నాళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తూ.. కేంద్రానికి లేఖ‌లు రాశారు. అదే స‌మ‌యంలో సీఎంకు కూడా లేఖ‌లు రాశారు. ఇక‌, త‌ర్వాత రాజ‌ధాని విష‌యంలోనూ ఆయన విమ‌ర్శలు గుప్పించారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ని ప్పులు చెరుగుతూ.. నిర‌స‌న దీక్షల‌కు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం స‌ర్కారీ భూముల‌ను విక్రయిస్తోంద‌ని, ఒక్కసారి అధికారం ఇవ్వమ‌న్నది ఇందుకేనా ? అని జ‌గ‌న్ ప్రభుత్వంపై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. అన్న వ‌చ్చాడు భూములు అమ్ముతున్నాడు-అనే స్లోగ‌న్‌తో ఇటీవల క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మౌన దీక్షకు కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శలు గుప్పించారు. ఇంత వ‌ర‌కు క‌న్నా త‌న జాబ్ బాగానే చేశారు. రాష్ట్రంలో ఉన్నారు కాబ‌ట్టి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. కానీ, అదే స‌మ‌యంలో ఆయ‌న జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. జ‌గ‌న్‌ను ఆయ‌న ఏయే విష‌యాల‌పై విమ‌ర్శలు గుప్పిస్తున్నారో.. దాదాపు అవే ప‌రిణామాలు కేంద్రంలోనూ సాగుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం స్థంస్థల‌ను న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గుండుగుత్తుగా అమ్మేస్తోంది. అదే స‌మ‌యంలో బొగ్గు గ‌నుల‌ను, రైల్వేల‌ను, విమాన‌యాన సంస్థల‌ను కూడా కేంద్రంలో మోడీ స‌ర్కా రు అమ్మకానికి పెట్టింది. మీరు రాష్ట్ర ప‌రిణామాల‌పై స్పందించ‌డం మంచిదే అయినా.. అదే స‌మ‌యంలో మీ సొంత పార్టీ చేస్తున్న నిర్వాకాల‌ను మాత్రం స‌మ‌ర్ధించ‌డం ఓ నైతికత ఉన్న నాయ‌కుడిగా ఎంత మాత్రం కూడా స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మీరు కేంద్రాన్ని ప్రశ్నించ‌లేక పోతే.. రాష్ట్రంలోనూ స‌ద‌రు అంశాల‌పై కాకుండా విమ‌ర్శించేందుకు, రాజ‌కీయాలు చేసేందుకు మ‌రో అంశాన్ని ఎంచుకోవ‌డం ఉత్తమ‌నేది ప‌రిశీల‌కుల వాద‌న‌. మ‌రి దీనిపై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Posts