రాష్ట్రంలో రెవెన్యూరికార్డుల అప్ డేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు రెవెన్యూ శాఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రెవెన్యూ రికార్డుల అప్ డేషన్, డాష్ బోర్డ్, పెండింగ్, తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు 2.56 కోట్ల ఎకరాల భూరికార్డుల ప్రక్షాళనను పూర్తి చేశారని, ఇందులో 93 శాతం భూముల వివరాలు Part నమోదు అయ్యాయని సి.యస్ వివరించారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ, దేవాదాయ, వక్ఫ్, పట్టణ భూముల వివరాలను ప్రక్షాళన చేయాలని, సి.యస్ సంబంధిత శాఖా అధికారులను ఆదేశించారు. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ధరణి వెబ్ సైట్ ద్వారా భూముల వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ కు చర్యలు చేపడుతున్నామని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమ వివరాలను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి అధికారులకు తెలుపడంతో పాటు పట్టదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతు బందు పథకానికి సంబంధించి చెక్కుల ముద్రణపై వివరాలను ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు తెలిపారు.ప్రభుత్వ వెబ్ సైట్ లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధునికరించడంతో పాటు వీటి నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందింస్తున్నట్లు సి.యస్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించి 265 వెబ్ సైట్లు ఉన్నాయని, వీటిని మొబైల్ ఫ్రెండ్లీగా రూపొందించడంతో పాటు సోషల్ మీడియాతో అనుసంధానం చేయనున్నామన్నారు. ఐటి శాఖ ద్వారా టివెబ్ ను లాంచ్ చేయనున్నామని, ప్రతి శాఖకు సంబంధించి డిపార్ట్ మెంట్ ఫ్రొఫైల్, సర్వీసెస్, స్కీం ల వివరాలు ఉండేలా చూస్తామన్నారు. ఐటి శాఖ ద్వారా ప్రత్యేకంగా మేనేజర్లను నియమించి వివిధ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. టి వెబ్ అన్ని శాఖలకు గా పనిచేస్తుందన్నారు. టి వెబ్రూపకల్పనపై ఐటి శాఖ ముఖ్యకార్యదర్సి జయేష్ రంజన్ అధికారులకు తెలుపుతూ, ప్రతి శాఖ వెబ్ సైట్ ను సమీక్షించడంతో పాటు రేటింగ్, ఆడిట్, అవార్డులు ఇవ్వడానికి యోచిస్తున్నట్లు తెలిపారు.వివిధ శాఖలకు సంబంధించి రియల్ టైమ్ డాటాని డాష్ బోర్డు ద్వారా తెలుసుకొనేలా చర్యలు చేపడుతున్నట్లు సి.యస్ అధికారులకు తెలిపారు.ప్రభుత్వ హాస్టళ్ళు, ఆసుపత్రుల వివరాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, కెసిఆర్ కిట్స్, మానవ వనరులు, వివిధ శాఖల అంగన్ వాడి, రేషన్ షాపులకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనేలా రూపొందిస్తున్నామన్నారు.మున్సిపల్ శాఖ ద్వారా ఇప్పటికే ఆన్ లైన్ లో సిటిజన్ సర్వీసులు అందిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ఉన్న వివిధ శాఖలు డాటాబేస్ ను డాష్ బోర్డుకు అనుసంధానం చేయాలన్నారు. డాష్ బోర్డు రూపకల్పనకై తీసుకున్న చర్యలపై జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా అధికారులకు వివరించారు.గత అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగిన పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలను వెంటనే పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను సి.యస్ ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సినర్జి, ఫెర్ఫార్ మెన్స్ ఇండికేటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి అవసరమైన అంశాలపై ప్రతి మంగళ వారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సి.యస్ తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా రామకృష్ణారావు, సోమేశ్ కుమార్, శ్రీమతి శాంతి కుమారి, శాలినీ మిశ్రా, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, వికాస్ రాజ్, సి.వి.ఆనంద్, జయేష్ రంజన్, ఆర్.వి.చంద్రవదన్, పార్ధసారధి, శివశంకర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, జగధీశ్వర్, దానకిషోర్, జ్యోతి బుద్ధప్రకాశ్, శ్రీలక్ష్మీ, నిరంజన్ రావు, సి.యం ఓ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, విజయ్ కుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్వింధర్ సింగ్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డా.టి.కె.శ్రీదేవి, విద్యాశాఖ కమీషనర్ శ్రీ కిషన్, రాజేంద్ర నిమ్ జె తదితరులు పాల్గొన్నారు.