YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

అలవాటుగా మారిన మాస్క్

అలవాటుగా మారిన మాస్క్

అలవాటుగా మారిన మాస్క్
హైద్రాబాద్, మే 26,
కరోనాతో మాస్క్కి మనిషికి విడదీయరాని బంధం ఏర్పడింది. వైరస్ కలకలం మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మస్ట్గా పెట్టుకోవాల్సిన అవసరమేర్పడింది. లాక్ డౌన్ ఫస్ట్ఫేజ్లో మార్కెట్లో ఇవి దొరకని పరిస్థితి ఉండేది. జనం మాస్క్ల కోసం మెడికల్ షాపులకు క్యూ కట్టారు. కొన్నాళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్క్ మస్ట్ అని ప్రభుత్వం ఆర్డర్ వేయడంతో  డిమాండ్ పెరిగిపోయింది. సర్జికల్ మాస్క్ లు, ఎన్95 మాస్క్ లు కొనలేని వారు ఇంట్లోనే తయారు  చేసుకోవడం స్టార్ట్చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పేపర్ మాస్క్ నుంచి క్లాత్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో మాస్క్ అవసరం నుంచి అందంగా ఉండాలనే ఆలోచన వరకు వెళ్లిపోయారు.అసలే కరోనా కాలం. ఎవరైనా తుమ్మినా, దగ్గినా, జలుబు చేసినా వైరస్ భయమే. దీంతో అందరు మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే మాస్క్  తప్పనిసరి అయ్యింది. అది  లేకుండా కనిపిస్తే సర్కార్ వెయ్యి రూపాయల ఫైన్ వేస్తోంది. దీంతో ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న మాస్క్ లను వాడుతున్నారు.  పేపర్, కాటన్ క్లాత్, సింగిల్ లేయర్, డబుల్ లేయర్, త్రిబుల్ లేయర్, సర్జికల్, హ్యాండ్ మేడ్ మాస్క్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  పెళ్లిలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు షేర్వాణి, లెహంగా, చీరలకు నప్పే మాస్క్ లను డిజైన్ చేయించుకుని యూజ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ పిల్లలతో మాస్క్ లు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలు చేసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తున్నారు.ఉపాధి కోల్పోయిన చాలామంది మాస్క్ లు అమ్ముకుంటున్నారు. ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్ లో    హైపర్ షీల్డ్ సూపర్ మాస్క్ రీ యూజబుల్, అవుట్ డోర్ ప్రొటెక్ట్ మాస్క్, అలెన్ సొలి మాస్క్ లు, లూయిస్ ఫిలిప్పి మెన్స్ 3 ప్లై మాస్క్, స్మార్ట్ బై హెల్త్ ప్లస్ కెఎన్95 మాస్క్, ఏషియన్ వాషబుల్ రీయుజబుల్ ఫేస్ మాస్క్ లు లభిస్తున్నాయి.  వీటి ధరలు 169 నుంచి వెయ్యికి పైగా ఉన్నాయి. మాస్క్ లలో డిఫరెంట్ కేటగిరిలు కూడా ఉన్నాయి. 3 ప్లై ఫేస్ మాస్క్, డిస్పోజబుల్ ఫేస్ మాస్క్, సర్జికల్ మాస్క్, ఎన్95 కేఎన్ 95 ఎఫ్ఎఫ్పీ2 రెస్పిరేటర్ మాస్క్, నాన్ వోవెన్ ఫేస్ మాస్క్, రీయూజబుల్ ఫేస్ మాస్క్, ఇయర్లూప్ మాస్క్లు, 2ప్లై ఫేస్ మాస్క్, విజర్ మాస్క్ వంటివి ఉన్నాయి. వీటిధరలు రూ.60 నుంచి ఉన్నాయి.డైలీ లిస్ట్ లో మాస్క్ చేరిపోయింది. కరోనానే కాదు పొల్యుషన్ ని అవైడ్ చేసేందుకు, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు మాస్క్ చాలా బెస్ట్. మాస్క్ నార్మల్ గా ఎందుకు ఉండాలి, ఫన్ యాంగిల్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది.  మాస్క్ ల మీద  స్టైల్ గా ఉంది కదా.. నా క్కూడా నచ్చింది, కొంచెం గ్యాప్  ఇస్తారా, గో కరోనా గో వంటి డైలాగ్స్ తో రూపొందించాం. ఇవి 100% కాటన్, 3 లేయర్స్ ఉంటాయి. వాషబుల్, రీ యూజబుల్ కూడా. 3 ప్యాక్స్ మాస్క్ కాస్ట్ 349, 5ప్యాక్ ల మాస్క్ కాస్ట్ 499గా ఉంది. మా ఆన్లైన్ వెబ్ సైట్ మాడ్ మంకీ స్టోర్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Related Posts