YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఫార్మా అభ్యర్ధులకు ఉపాధి లేదు

ఫార్మా అభ్యర్ధులకు ఉపాధి లేదు

ఫార్మా అభ్యర్ధులకు ఉపాధి లేదు
హైద్రాబాద్, మే 26,
 ఫార్మా అభ్యర్థులకు శాపంగా మారుతున్నది. ఫార్మసీ కోర్సు పూర్తిచేసినా ఉపాధి లభించని పరిస్థితి నెలకొంది. ఉద్యోగ భద్రత లేకపోవడంతో బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి చదివినా కనీస వేతనం లేకపోవడంతో ఇతర రంగాలవైపు దృష్టిసారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫార్మసిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమైనా ప్రస్తుతం ఉన్న కళాశాలలు, మందుల దుకాణాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఫార్మసిస్టులను నియమించకపోవడం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర విభజన తరువాత వైద్యఆరోగ్యశాఖలో ఏండ్లుగా ఖాళీగా ఉన్న నియామకాల కాస్తకూస్తో భర్తీకి కసరత్తు చేస్తున్న సర్కార్‌.. ఫార్మా రంగంపై కూడా దృష్టిసారించాలని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో నాన్‌ఫార్మసిస్ట్‌లు తిష్టవేయడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడటంతోపాటు అర్హూలు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఫార్మ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ సంజరురెడ్డి అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం కేంద్ర అడ్మిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ శాఖలో పిటీషన్‌ దాఖలు చేయగా.. కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ స్పందించింది. 'ఫార్మసీలలో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌లు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాణ్యమైన మందులు ప్రజలకు అందాలని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం 1940, రూల్స్‌ 1945, సెక్షన్‌ 65(2) ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఫార్మసీ ప్రాక్టీస్‌ రెగ్యులేషన్స్‌-2015 రూపొందించి ఇండియా ఎక్స్‌ట్రార్డినరీ గెజిట్‌లో ప్రచురించింది. కానీ, అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. ఇలాఉండగా, 2008 అంచనాల ప్రకారం 65 శాతం జనాభా ఆధునిక వైద్య సౌకర్యాలు పొందడంలేదని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తే, గ్రామీణ ప్రజలు తమ సంపాదనలో 79 శాతం మందుల కొనుగోలుకే ఖర్చు పెడుతున్నారని నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) ఆవేదన వ్యక్తం చేసింది.  దేశంలో 1,000పైగా ఫార్మసీ కళాశాలలు ఉంటే మన రాష్ట్రంలోనే 145 వరకు ఉన్నాయి. ఏడాదికి 10 వేల మందికిపైగా విద్యార్థులు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ చేసి అభ్యర్ళు బయటకు వస్తున్నారు. అయితే, వారికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో కళాశాలలు, మందుల దుకాణాలు తక్కువ వేతనాలకు అనర్హులను నియమిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 2009లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం అమల్లోకి రావడంతో దాదాపు 250 కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అందులో తెలంగాణలో 145 కళాశాలు ఉన్నాయి. అంటే దేశంలో 1,000పైగా కళాశాలలు ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనే సగానికి సగం ఉన్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకు మందుల తయారీ కంపెనీల్లో బీ ఫార్మసీ, ఎం ఫార్మసిస్టుల పాత్ర కీలకం. అలాంటి కీలక పోస్టుల్లో నాన్‌ ఫార్మసిస్టులు పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఒక్కో ఫార్మసీ కంపెనీల్లో కనీసం 50 మందిని అర్హులను నియమించినా ఉపాధి సమస్య కొంతవరకు తీరే అవకాశముందనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 550 మందుల తయారీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 430 ఔషద తయారీకి సంబంధించినవి కాగా, మిగతా 120 బల్క్‌ డ్రగ్స్‌ సంస్థలు ఉన్నాయి. మందుల దుకాణాల్లో ఫార్మసీ-ఔషదాల కార్మిక చట్టాల ప్రకారం.. ప్రతి ఎనిమిది గంటలకు ఒక రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు ఉండాలి. అంటే ప్రతి మెడికల్‌ షాపులో కనీసం ఇద్దరు ఫార్మసిస్టులు ఉండాలి. కానీ రాష్ట్రంలో 25వేల మెడికల్‌ షాపులు ఉంటే అందులో 90 శాతం అనర్హులే తిష్టవేశారని సమాచారం. దీంతో అర్హులకు ఉపాధి కొరతతోపాటు ప్రజారోగ్యం కుంటుపడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 150 ఫార్మసీ కళాశాలల్లో రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్టులే విద్యాబోధన చేయాలి. ఒక్కో కళాశాలకు 17 నుండి 20 మంది విద్యా బోధకులు ఉండాలి. ఈ లెక్కన 3 వేల మందికి ఉద్యోగాలు రావాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా ప్రయివేటు యాజమాన్యాలు అతి తక్కువ ఫ్యాకల్టీతో కళాశాలను నెట్టుకువస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులను బోధకులుగా నియమిస్తుం డటంతో స్థానికులకు ఉపాధి కరువవుతోందని ఆరోపణలు న్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 70 శాతం వరకు ఫార్మసిస్టు పోస్టులే లేకపోవ డం ఆందోళన కలిగించే అంశం. ఔషద చట్టాలు 1948, 1940 ప్రకారం... ఔషదాలను ఫార్మసిస్టుల ద్వారానే రోగులకు పంపిణీ చేయాలి

Related Posts