YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కేటిఆర్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కేటిఆర్

సంక్షేమానికి ఇది స్వర్ణయుగం.  పేదవాడి కన్నీటి లోంచి ఉద్భవించిన రాష్ట్రంలో పేదోడి సంక్షేమం కోసం కేసీఆర్ పాటు పడున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటన సందర్బంగా అయన మాట్లాడారు. టీడీపీ 70 రూపాయలు ఇచ్చింది.. 200 ఇచ్చి కాంగ్రెస్ ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంది. 5500 కోట్లు పేదవాడి పెన్షన్ల కోసం వెచ్చిసితున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అయన అన్నారు. కాంగ్రెస్ 23 లక్షల మందికి పెన్షన్ ఇస్తే అదనం గా 13 లక్షల మంది కి మనం ఇస్తున్నాం. మనసున్న ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంటుందో ప్రజలు గమనిస్తున్నారని అయన అన్నారు. సీఎం మనువడు , మనువరాలు తినే సన్న బియ్యం హాస్టళ్ల లో పెట్టిన ఘనత కేసీఆర్ గారిదని అన్నారు. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పని ముఖ్యమంత్రి మన కేసీఆర్ . మంచినీళ్లు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగననని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆరని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి మీద భయం పోయింది. కేసీఆర్ పాలనలో తల్లీ, పిల్లల పోషణ జరుగుతుంది. ఇది పేదల ప్రభుత్వం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్దయీత్రలు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు యాత్రలు చేస్తున్నారని అయన విమర్శించారు. నిరుద్యోగ బృతి ఇస్తానంటున్నంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క చెబుతవా? లెక్కలున్నయా..?  ఎవరికిస్తావ్ భృతి అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీపి హామి అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఉంది. రిటైర్ అయ్యే కాంగ్రెస్ నాయకులకు బృతి ఇవ్వడం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెయలేరు. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మోసం చేస్తుందని అన్నారు. నీళ్లు, నిదులు , నియామకాల నినాదం మీదే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది. ప్రతీ పట్టణం ఖమ్మం మాదిరి గా అబివృద్ధి చేస్తాం. ఇది పేదల ప్రభుత్వం , లాభం తప్ప మోసం చేయ్యదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస ది మొదటి నుంచి మోసాలు, ద్రోహాల, వంచనే ని అయన అన్నారు. ముదిగొండలో ఆరుగురిని కాల్చిన ఘనత కాంగ్రెస్ ది . గడ్డం తియ్యని ప్రతోడు రబ్బర్ సింగ్ కాదు ..??  గడ్డం పెంచితే ఓట్లు వేస్తారా అని ఆడిగారు. గడ్డం తియ్యకుంటే తియ్యకు.. ఎవడు తియ్యమన్నాడు. మంచి పనులు చేస్తే ప్రజలు దీవిస్తరు.. గలీజు పనులు చేస్తే తరుమికొడతారని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి తీరుతాం. సీతారామ పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. మిషన్ భగీరద ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంబిస్తం..  భద్రాచలం దేవస్థావం 100 కోటలతో అబివృద్ధ చేసి తిరుమల కు దీటు గా నిలబెడతాం. మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ , పాల్వంచల కేటీఫిఎస్ పూర్తి చేసి వెలుగులు నింపుతామని అన్నారు.

Related Posts