YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఒక్కటైన ప్రతిపక్షాలు... తలొగ్గిన ప్రభుత్వం

ఒక్కటైన ప్రతిపక్షాలు... తలొగ్గిన ప్రభుత్వం

ఒక్కటైన ప్రతిపక్షాలు... తలొగ్గిన ప్రభుత్వం
తిరుపతి, మే 26,
తిరుమల తిరుపతి భూముల వేలం వివాదం ముదిరి పాలకమండలి నుండి ప్రభుత్వం వరకు విమర్శల పాలవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీటీడీ పాలకమండలి భూముల వేలానికి రెండు కమిటీలను నియమించగా .. తాజాగా ఆ కమిటీలు వేలానికి కాదని.. జస్ట్ వేలానికి రోడ్ మ్యాప్ మాత్రమే తయారుచేసేందుకే నియమించామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సెలవిచ్చారు.అంటే చైర్మన్ చెప్పిన మాటల ప్రకారం వేలం వేయాలంటే ఎలా వేయాలని ఒక కమిటీ చెప్తే.. ఎలా ముందుకు వెళ్ళాలో ఇంకో కమిటీ చెప్తుందంట. ఆ రెండు కమిటీల నివేదికలు వచ్చాకనే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు భూముల అమ్మకానికి నిర్ణయించుకున్నామని అసత్య ప్రచారం చేస్తుందని కౌంటర్ ఆరోపణలు కూడా చేసేశారు.ఇక ఏపీ ప్రభుత్వం అయితే భూముల అమ్మకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసేసింది. అయితే.. ఇప్పుడు టీటీడీ పాలకవర్గం అమ్మకానికి నిర్ణయించుకుందని.. ఆ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లుగా కాకుండా.. 2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం జీవో నెంబర్‌ 888ను విడుదల చేశారు.ఇక ఇప్పుడున్న పాలకవర్గానికి అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని భూముల అమ్మకంపై పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం పాలకమండలి మతపెద్దలు, భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించింది. అయితే టీటీడీ మాత్రం అమ్మకానికి ఇంకా నిర్ణయమే తీసుకోలేదని టర్న్ ఇచ్చేసింది.అయితే టీటీడీ భూముల వేలం విషయంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులు దీనిపై తీవ్రంగా విమర్శలకు దిగారు. ఇక అటు ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా నేతలు టీటీడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలకు దిగారు. తెలంగాణ బీజేపీ అయితే ఏకంగా టీటీడీ ఆస్తులను కాపాడేందుకు దేనికైనా సిద్ధమని ప్రకటించేశారు. భక్తులు ఏడుకొండలవాడికి ఇచ్చిన భూములను కాపాడే దమ్ములేదా? అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేయడంతో పాటు మీరు చేసే దద్దమ్మ పనులను మళ్ళీ నిరర్ధక ఆస్తులను కొత్త కొత్త పేర్లను తెరమీదకి తెస్తారా? అంటూ రెచ్చిపోయారు. టీటీడీ ఆస్తులను కాపాడేందుకు వీధి పోరాటాలకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయితే ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలకు దిగింది. గల్లీ స్థాయి నేత నుండి చంద్రబాబు వరకు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వర్షం కురిపిస్తూ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. జనసైనికుల పేరిట సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పట్టేశారు. ఇక ఇటు తెలుగు మీడియా నుండి నేషనల్ మీడియా వరకు టీటీడీ ఆస్తుల వేలం విషయాన్ని భారీగా హైలెట్ చేశాయి. దీంతో మొత్తంగా ప్రభుత్వం అమ్మకం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే టీటీడీకి పునఃసమీక్షించుకోవాలని మాత్రమే తెలిపింది. మరి పూర్తిగా వేలం ఆపేసినట్లేనా లేక కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లుగానే భావించాలా?!

Related Posts