YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో హడావిడి

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో హడావిడి

శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో హడావిడి
కర్నూలు, మే 26, 
ఏటా ఎండాకాలం వస్తోందంటే చాలు శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో హడావిడి మొదలవుతుంది. ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువగా పడినా నీటిని దిగువకు విడుదల చేయడంతో బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన శ్రీశైలం డ్యాం వద్ద నెలకొన్న కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా ఇంతవరకు ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్తు కాంతులను అందించేందుకు విద్యుదుత్పత్తిని తయారు చేస్తున్నారు. అయితే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 812 అడుగులకు చేరుకోవడంతో కేవలం 35 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నీలిపివేస్తున్నట్లు  శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రం ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ రాంబాబు తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ విద్యుత్ ఉత్పత్తి చేసామని ఇంతవరకూ  ఈ సీజన్లో ఇదే విద్యుత్ ఉత్పత్తి కి ముగింపు అని తెలిపారు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ఇన్ ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 812 అడవులుగా ఉండడం అదే శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35 టీఎంసీల ఉంది. కృష్ణా వాటర్ రివర్ బోర్డు ఆదేశాల మేరకు ఇరు తెలుగు రాష్ట్రాలు నీటి పంపకాలు జరగడంతో ఆంధ్ర కు సంబంధించిన వాటా ముగియడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.దీంతో ఇకమీదట శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరగదు. అయితే వర్షాలు త్వరగా కురిస్తే కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో అలాగే ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఆశించినంత వర్షాలు కురిస్తే కృష్ణా నది వరద ప్రవాహం తో శ్రీశైలం ఆనకట్ట నిండి మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది అంతవరకూ ఇప్పట్లో జల విద్యుత్ ఉత్పత్తి జరగబోదు.

Related Posts