YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 సరిహద్దులు ఖాళీ చేస్తున్న చైనా

 సరిహద్దులు ఖాళీ చేస్తున్న చైనా

 సరిహద్దులు ఖాళీ చేస్తున్న చైనా
కోల్ కత్తా, మే 26
భారతదేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా వైరస్ పుట్టిన తొలి రోజుల్లో చైనానుంచి సమస్త దేశాల ప్రజలు బతుకుజీవుడా అనుకుంటూ తమ తమ దేశాలకు పయనం కాగా, ఇప్పుడు భారత్ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో చైనా తన దేశస్థులను భారత్ నుంచి తరలించాలని నిర్ణయించుకోవడం విశేషం.కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని చైనా అధికార వెబ్‌సైట్‌లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు.విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్‌ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్‌-చైనాల మధ్య లదాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం.   వూహాన్‌లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా  విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్‌ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్‌ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.  కాగా, 24 గంటల్లో భారత్‌లో వరుసగా నాలుగోరోజు కూడా రికార్డు స్తాయిలో దాదాపు 7 వేల కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి.ఒక్కరోజులో 154 మంది కరోనా రోగులు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న విదేశీయులు పెద్ద ఎత్తున తమ తమ దేశాలకు తరలిపోయే ప్రక్రియ ప్రారంభమైంది.

Related Posts