చిరుతో జెనీలియా... రీ ఎంట్రీ
హైద్రాబాద్, మే 26,
నీలియా డిసౌజా గుర్తుందా.. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. బొమ్మరిల్లు చిత్రంలో అమాయకంగా కనిపించి అందరి మనసులు దోచుకుంది. హిందీలో తుజే మేరి కసం అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది జెనీలియా. హాసినిగా అలరించిన జెనీలియా 2006లో బొమ్మరిల్లు చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకుంది.2003 నుంచి 2008 ఆరెంజ్ చిత్రం వరకూ వెలుగు వెలిగింది. అనంతరం ఆమె బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు వెళ్లింది. అక్కడే రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమవివాహం చేసుకుంది. 2012లో వీరి పెళ్లయింది. ఆ తర్వాత ఆమె అంతగా కనిపించలేదు. బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైంది. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య అంటూ కొరటాల శివ అండ్ టీమ్ తో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఇది ఇలా ఉంటే తన నెక్ట్స్ సినిమాని చిరంజీవి ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ లో చిరంజీవి నటించనున్నాడు. ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జెనీలియాని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఆమె చివరగా తెలుగులో 2012లో రానా నటించిన నా ఇష్టం చిత్రంలో నటించింది. అతి త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. జెనీలియా ఈ మూవీతో రి ఎంట్రీ ఇస్తే బోణీ బాగానే వుంటుందని అంతా భావిస్తున్నారు.