YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రాహూల్... ది గ్రేట్

రాహూల్... ది గ్రేట్

పేదరికం., కష్టాలు ప్రతిభకు ఎప్పుడు అవరోధం కావని నిరూపించాడా యువకుడు.... తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు....., గాయాల బాధలు....., కన్నతల్లి మరణం ఇవేమి లక్ష్య సాధనకు అడ్డంకి కాలేదు......కసితో లక్ష్యాన్ని సాధించి అందరి అభినందనలు అందుకున్నాడు..... అతనే రాగాల రాహుల్......ప్రకాశం జిల్లా స్టువర్టు పురం నుంచి గోల్డ్‌కోస్ట్‌లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు. ఫిట్‌నెస్‌ లేదు.... ఫిజియో ట్రైనర్‌ లేడు.....వేధించే  గాయాలు.... ఇవన్ని తట్టుకుని కామన్వెల్త్‌ గేమ్స్‌లో  దేశానికి బంభారత వెయిట్‌ లిఫ్టర్ వెంకట రాహుల్ 85 కేజీల విభాగంలో  స్వర్ణాన్ని సాధించాడు. ఏ మాత్రం ఆర్ధిక వనరులు లేని నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక నేపథ్యం రాగాల రాహుల్‌ సొంతం....ప్రకాశం జిల్లా స్టువర్టుపురం..... తెలుగు రాష్ట్రాల్లో ఆ ఊరి పేరు తెలియని వారుండరు. అలాంటి స్టువర్టుపురం ఇమేజీని ఒక్కసారిగా మార్చేశాడు యువ వెయిట్‌ లిఫ్టర్‌ రాహుల్‌..... కష్టాలను అధిగమిస్తూ తల్లిదండ్రుల కలలను నెరవెర్చేందుకు శ్రమించినందుకు తగిన ఫలితం సాధించాడు. ఆస్ట్రేలియాలోని గో్ల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్  85 కేజీల విభాగంలో రాగాల వెంకట రాహుల్‌ మొత్తం 338 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 187 కేజీలు ఎత్తిన రాహుల్‌ స్నాచ్‌లో 151 కేజీలు లేపి స్వర్ణం దక్కించుకున్నాడు. మెడలో తల్లి  కాలి మెట్టె.....  ఛాతీపై తల్లిదండ్రుల చిత్రాల పచ్చబొట్టు.... కళ్ళ నిండా ఆత్మవిశ్వాసం....కామన్‌ వెల్త్ క్రీడల్లో  బరిలో నిలిచినపుడు రాహుల్‌  కనిపించింది ఇలాగే..... క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తడబడినా  మెరుగైన ప్రదర్శనతో  సునాయసంగా స్వర్ణాన్ని సాధించేశాడు.  క్యాన్సర్‌తో కన్నుమూసిన తల్లికి నివాళిగా తన పతకాన్ని అంకితమిస్తున్నట్లు రాహుల్‌ ప్రకటించాడు. కొద్ది నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అతనికి ఆర్ధిక సహకారాన్ని అందించే సమయంలో తల్లిదండ్రులతో కలిసి  వెళ్లాడు.  ఆ తర్వాత ఆమె క్యాన్సర్‌తో కన్నుమూశారు.  మెరుగైన చికిత్స చేయించుకోలేక తల్లి కన్నుమూయడంతో రాహుల్‌ కొద్ది కాలం పాటు క్రీడల్లో తడబడ్డాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న తల్లి కోరిక గుర్తు రావడం ప్రాక్టీస్ చేసి విజయం సాధించాడు. గతేడాది ఇదే వేదికపై జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రాహుల్‌ ఏడాదిలోపే మరో సారి స్వర్ణం సాధించాడు. గతేడాది మోకాలికి గాయమైంది. కొన్నాళ్ల క్రితం కామెర్లు రావడంతో ఒక్కసారిగా 20 కిలోల బరువు తగ్గిపోయినా...., వాటిని  అధిగమించి స్వర్ణ పతకం గెలవడం చాలా ఆనందంగా ఉందని.. నా జీవితంలో ఇది అత్యంత విలువైన విజయమని రాహుల్ చెప్పాడు.  రాహుల్‌ పుట్టిపెరిగిందంతా పల్లె వాతావరణంలోనే. సొంత ఊరి తీరు చూస్తే అక్కడ దొంగతనాలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతంలో పుట్టి క్రీడల్లో సత్తా చాటాడు.  ఆర్ధిక పరమైన ఇబ్బందులు, సరైన సౌకర్యాలు, మార్గనిర్ధేశం లేక ఆటను మధ్యలోనే ఆపేసే పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా ఎంతో కష్టపడి కామన్వెల్త్‌ స్థాయికి చేరాడు రాహుల్. క్రీడల్లో రాణించాలనుకున్న కోరిక నెరవేరక పోవడంతో కొడుకునైనా వెయిట్‌లిఫ్టర్‌ చేయాలనే లక్ష్యంతో రాహుల్‌ తండ్రి ఉన్న ఆస్తులన్ని అమ్ముకున్నారు. స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రాథమిక శిక్షణ ముగిసిన తర్వాత  ఓ దశలో  ప్రాక్టీస్‌ నిలిపివేసే పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఉన్న రెండెకరాల పొలాన్ని అమ్మేసి  కొడుకు కోసం ఖర్చు చేశాడు. ఎన్ఐఎస్‌లో శిక్షణకు వెళ్లే వరకు రాహుల్‌ది అదే పరిస్థితి.  ఆ తర్వాతే కఠోర సాధనతో ముందుకు దూసుకుపోయాడు. కొడుకు స్వర్ణపతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని వెంకట రాహుల్‌ తండ్రి మధు చెప్పారు.  చిన్నప్పటి నుంచి రాహుల్  కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని చెప్పారు . ప్రభుత్వ సహకారం అందిస్తే  ఒలంపిక్స్‌లో పతకాన్ని తీసుకురావడమే అతని లక్ష్యమన్నారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో తన అన్న విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రాహుల్ చెల్లి మధుప్రియ అన్నారు. మధుప్రియా కూడా నేషనల్ లెవల్‌లో వెయిట్‌లిప్టింగ్‌లో  క్రీడాకారిణి. ఆర్ధిక సహకారం లేకపోవడంతో ప్రాక్టీస్‌ నిలిపివేసింది. రాహుల్ సాధించిన బంగారు పథకం యావత్‌ ప్రపంచానికే ఆదర్శంగా తీసుకోవాలని ఎరుకుల హక్కుల పౌర సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. స్టువర్టుపురం భారతందేశంలో రాహుల్ గుర్తింపు తెచ్చారని తెలిపారు. ప్రభుత్వం తరపున రాహుల్ కుటుంబానికి ఎటువంటి సహాయం అందకపోయినా రాహుల్ తండ్రి ఎంతో కష్టపడి అతడిని ఇంత స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం సహకరించి ఆర్థిక సహాయం అందిస్తే మరింత మంది క్రీడాకారులు ముందుకు వస్తారని రాహులు కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Related Posts