YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైద్రాబాద్, మే 26,
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం  ప్రగతి భవన్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వైరస్ నియంత్రణ చర్యలు, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సరి, బేసి విధానంలో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా, లేదా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా? విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయంపైనా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగుస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సేవల ప్రారంభించే అంశంపైనా సమావేశంలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ ఆర్టీసీ బస్సులను నడిపాలంటూ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
 

Related Posts