YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సంవత్సరం పాలనపై అభిప్రాయసేకరణ, అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు రైతుకు మేలు కానున్నది

 సంవత్సరం పాలనపై అభిప్రాయసేకరణ, అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు రైతుకు మేలు కానున్నది

 సంవత్సరం పాలనపై అభిప్రాయసేకరణ, అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు రైతుకు మేలు కానున్నది
 జిల్లా కలెక్టర్
తిరుపతి,  మే 26
మనపాలన – మీకోసం కార్యక్రమం రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరకాదు, అధికలాభాలు తెచ్చి పెట్టే సూచనలు రైతులు, సంబంధిత శాఖలు , అగ్రికల్చర్ సైంటిస్టులు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి , వాణిజ్య పన్నులు , ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. మనపాలన – మీకోసం రెండవరోజు సమీక్ష, అభిప్రాయసేకరణ స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులతో డిప్యూటి సిఎం సమావేశమై ముఖ్యమంత్రి వీడియో లైవ్ కు మునుపు ప్రముఖుల ప్రసంగాలు చర్చలు జరిపారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక సంవత్సర కాలంలో  ఏమి ప్రజలకు మేలుచేసాము, మరో నాలుగు సంవత్సరాల్లో చేయాల్సింది ఏమి వుందనడానికే మనపాలన – మీకోసం కార్యక్రమం ఇప్పటికే లబ్దిదారుల్లో ఆనందం చూస్తున్నాం అన్నారు. సంకల్పం, ధైర్యం, ప్రజలకు మేలుచేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. సచివాలయ వ్యవస్థ కరోనా  కాలంలో ప్రజలకు దగ్గరై సేవలంధించారు మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. జిల్లాలో మామిడికి గత 10 సంవత్సరాల్లో రేటులేదు, ఈసారి 25 శాతం పామత దిగుబడి వుంది అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం చూపాలి అన్నారు. ఇక పడమటి ప్రాంతాల్లో నీటి లభ్యత తక్కువ టమోటో పంట అధికం, ఈసారి కరోనాతో నష్టపోయారు అయినా జిల్లా యంత్రాంగం 30 శాతం మార్కెటింగ్ చేయగలిగారు అన్నారు. ముఖ్యమంత్రిని కుప్పం వరకు నీళ్ళు అడిగాము తప్పక ఇస్తామన్నారు మాట ఇచ్చారంటే నీలు వచ్చినట్లే అన్నారు. పార్లమెంట్ లో అన్నీ పాటలకు బోర్డు లు వుండయి టమోటా బోర్డు కాలనీ ప్రస్తావించాము, ముఖ్యమంత్రి సహకారంతో సాధిస్తామని అన్నారు. కరోనా కష్టకాలంలో జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి రైతులను కొంతమేరకు ఆదుకున్నారని ధన్యవాదలని అన్నారు. శాసన మండలి సభ్యులు యండపల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుని ఒక సంవత్సరకాలంలో మానిఫెస్టో అమలు చేసి రైతులకు ఆదుకుంటున్నారు, సాధారణంగా ఏప్రభుత్వం అయినా మొదటి రెండు సంవత్సరాలు దృష్టి పెట్టారు, బిన్నంగా 90 శాతం ఇచ్చిన మాట మేరకు అమలుచేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ మోహన్ రెడ్డి అన్నారు. తన తండ్రి వై ఎస్ ఆర్ ఆశయం మేరకు  జగన్ మోహన్ రెడ్డి రైతుపక్షపాతిగా నిలవాలని అన్నారు. కరోనా కాలంలో జిల్లా కలెక్టర్ చొరవ, సచివాలయ వుద్యోగులు, వాలింటర్లు అద్బుతంగా సేవలందించారు ధన్యవాదాలు అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రైతులకు మేలు చేసేదిగా లేదు, జిల్లాలో 60 శాతం మంది వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు వారి పంటలకు గిట్టుబాటుధర కలిగేలా ప్రణాళికలు వుండాలని అన్నారు. కరోన వల్ల రైతులు మరో సంవత్సరం అయినా కోలుకోలేని పరిస్తితి ఈ రోజు వుంది అన్నారు. స్వామినాధన్ సిపార్సులు అమలు చేయాలి, హంద్రీ నీవా , గాలేరు నగరి పై దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆఖరు జిల్లాగా వున్న చిత్తూరు జిల్లాను ఆదుకోవాలని, మిగులుజలాల పోటీ రెడ్డి పాడు ఎత్తుపెంచాలి లేదంటే బవిష్యత్ లో నీటికి మరింత ఇబ్బందులు వస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త మాట్లాడుతూ మనపాలన – మీకోసం శుభపరిణామం ఏడాధిపాలన పై ప్రభుత్వం అమలు చేసిన పథకాల పై అభిప్రాయం సేకరణ అనేది గతంలో చూడలేదు అన్నారు. జిల్లాలో భూగర్భజలాల పరిస్తితి తెలిసిందే నీటి కొరతతో రైతులు టమోటా, మామిడికి అలవాటు పడ్డారు , పంటల మార్పు అవసరం వుంది అన్నారు. ప్రతిసారి ఈ సమస్య వస్తూనే  వుంది అందుకే ప్రభుత్వం అడ్వైజరీ బోర్డులు జిల్లా స్థాయి, మండల స్థాయికి శ్రీకారం చుట్టింది దీంతో రైతులకు ప్రభుత్వం ఏ పంటలు సాగుచేయాలని సూచిస్తుంది రైతుకు ఆదాయం ప్రధాన ద్యేయంగా మారనున్నది అన్నారు. గ్రామస్థాయిలో రైతు బారోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్  రైతు బజార్లు , కియోస్కూలు రానున్నాయి అన్నారు. కరోనా వల్ల ఈ సారి టమోటా రైతు నష్టం వాటిల్లింది, సి ఎం ఓ నుండి సమీక్షలు సూచనలతో 30 శాతం సహాయం చేయగలిగాము అన్నారు. ఇక మామిడి విషయంలో పల్ఫ్ ఆధారంగా పంటలు వేశారు పంటలు అధికం అయ్యాయి , ఫ్యాక్టరీలు అధికం అయ్యాయి మార్కెటింగ్ లేదు వీటిపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు.

Related Posts