ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రధాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి కళావెంకట్రావు కుడా పాల్గోన్నారు. ఈ ఆరోగ్య రధాలలో 200 రకాల వైద్య పరీక్షలు ఈసీజీ, యూరిన్, రక్త పరీక్షలతో పాటు డిస్పెన్సరీ అందుబాటులో ఉంటాయి. ఏజెన్సీలో పర్యటించనున్న ఆరోగ్య రధాలలో వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. పక్కా ప్రణాళికతో గిరిజనులకు వైద్యసేవలు గిరిజనలు పాలిట ప్రాణదాతగా ఆరోగ్యరధం. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ సంస్ధ రెండు ఆరోగ్య రధాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైధ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆరోగ్య రధంలో ఉన్న సదుపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కళావెంకట్రావు వివరించిన స్వచ్చాంద్ర వైస్ చైర్మన్ డా.సీయల్ వెంకట్రావ్, ఏపిస్టేట్ డాక్టర్ సెల్ ప్రెసిడెంట్ డా.పవన్. సీతంపేట,ఎచ్చెర్ల ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్యరధాలను తీసుకువెళ్లి వైద్యసేవలు అందిస్తారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైయ్యే ఆరోగ్యరధం సాయంత్రం 5గంటలవరకు గిరిజన గ్రామాల్లోనే అందుబాటులో ఉంటుంది. మలేరియా ,షుగర్,బీపీ ,టీబీ క్యాన్సర్ వంటి వాటిని తొలిదశలో గుర్తించ వాటిని ఎన్టీఆర్ ఆరోగ్యవైద్యసేవకు బదలాయించడం. భవ్య హెల్త్ కేర్ ద్వారా ఆరోగ్యరధాలను నిర్వహిస్తారు.