నియంత్రణ రేఖ వద్ద భారత, చైనా బలగాల మోహరింపు..
న్యూ ఢిల్లీ మే 26
లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. భారత, చైనా దళాలు ఆ ప్రాంతంలో తమ దళాలు మోహరించాయి. పాంగాంగ్ సో, గల్వాన్ వ్యాలీ వద్ద దళాలను రెట్టింపు చేసినట్లు భారత ఆర్మీ పేర్కొన్నది. ఇవే ప్రాంతాల్లో చైనా ఆర్మీ సుమారు 2500 దళాలను మోహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లడాఖ్ ప్రాంతం.. ఒకరకంగా 2017లో ఏర్పడిన డోక్లామ్ సంక్షోభంగా మారినట్లు తెలుస్తోంది. లడాఖ్ ప్రాంతంలో భారత సైన్యాన్ని పటిష్టం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. గల్వాన్ వ్యాలీలో ఉన్న డర్బూక్-షయాక్-డౌలత్ బెగ్ ఓల్డీ రోడ్డులో ఉన్న ఇండియా పోస్టు కేఎం120 వద్ద చైనా తమ దళాలను కేంద్రీకరిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తమ బలగాలను మోహరిస్తున్నట్లు తెలుస్తోంది.గల్వాన్ ప్రాంతంలోకి చైనా దళాలు రావడం ఆక్షేపణీయమని మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా తెలిపారు. వ్యూహాత్మక సంబంధాలు నిపుణ/డఉ అశోక్ కే కాంత్ కూడా ఈ అభిప్రాయాన్ని అంగీకరించారు. దౌత్యపరమైన చర్యల ద్వారానే రెండు దేశాల దళాల మధ్య ఉద్రిక్తతను తగ్గించగలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గల్వాన్ వ్యాలీలో చైనా బలగాలు సుమారు వంద టెంట్లను వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సమస్యాత్మకంగా మారిన డెమ్‌చోక్, దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతాల్లో భారత దళాలు పెట్రోలింగ్‌ను పెంచాయి