కరోనా కేసులు జాబితాలో పదోస్థానంలో నిలిచిన భారత్
న్యూఢిల్లీ మే 26
దేశంలో వరుసగా ఆరో రోజూ ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6535 పాజిటివ్ కేసులు నమోదవగా, 146 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,45,380కి పెరిగింది. ఇందులో 80,722 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 60490 మంది కోలుకున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4167 మంది బాధితులు మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జాబితాలో భారత్ పదోస్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 52667 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో 1695 మంది మరణించారు. తమిళనాడులో 17082 కరోనా కేసులు, 118 మంది మరణించారు. గుజరాత్‌లో 14468 పాజిటివ్ కేసులు నమోదవగా, 888 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 14053 కేసులు నమోదుకాగా, 276 మంది చనిపోయారు. రాజస్థాన్‌లో 7300 పాజిటివ్ కేసులు నమోదయ్యావగా, 167 మంది మరణించారు.