హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేత:డబ్ల్యూహెచ్‌వో
న్యూ ఢిల్లీ మే 26
యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్.. కోవిడ్19 చికిత్స కోసం కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. వాస్తవానికి ఈ డ్రగ్ కరోనా చికిత్స కోసం తయారు చేసింది కాదు. కానీ కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ మాత్రలు వేసుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. కోవిడ్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ద ల్యాన్సెట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను వాడడం నిలిపేసినట్లు ఆయన చెప్పారు. హెచ్‌సీక్యూ వినియోగంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తున్నదని, దీనిలో భాగంగానే ఆ మాత్రలను వాడడం లేదని టెడ్రోస్ తెలిపారు. హైడ్రాక్సీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ద ల్యాన్సెట్ తన కథనంలో పేర్కొన్నది. హైడ్రాక్సీక్లోరోక్వీన్, క్లోరోక్వీన్ లాంటి మందులను కేవలం మలేరియా పేషెంట్లు వాడాలని టెడ్రోస్ తెలిపారు.