తెలంగాణ విధానమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ రామచందర్ రావుకు ఆన్‌లైన్ మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఆయనకు చెందిన రెండు బ్యాంకుల ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు రూ. 35 వేలు దోచేశారు.ఈ నెల 1వ తేదీన సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో రెండు అకౌంట్ల(ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లు) నుంచి రూ. 35 వేలు కట్ అయినట్లు రామచందర్ రావుకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాక్‌కు గురైన ఎమ్మెల్సీ ఈ నెల 3వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. కేసు వివరాలను తెలుసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.