YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడలో ట్రూ కాలర్స్ మాఫియా

బెజవాడలో ట్రూ కాలర్స్ మాఫియా

మొబైల్ ఫోన్ తో మోసాలు ఈ కాలంలో అన్ని ఇన్ని కావు. ఎక్కడో నైజీరియా నుంచి మీకు లాటరీ తగిలిందంటూ వున్న డబ్బును ఊడిచేసే ముఠా నుంచి మన పక్కనే వుండే వారి వరకు కాల్ చేసి కాటేసే వారే ఎక్కువ అవుతున్నారు. తాజాగా అమరావతిలో వెలుగుచూసిన బాగోతం చూస్తే ఇలా కూడా సంపాదించేయొచ్చా అనే లా వుంది. అయితే ఈ మోసానికి పాల్పడిన వారు చివరికి శ్రీకృష్ణ జన్మస్థానం చేరుకున్నది ప్రతి వారు గుర్తించుకోవాలి. ప్రతిఒక్కరు అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ లో కాల్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఈ సంఘటన చాటి చెబుతుంది.విజయవాడ కార్పొరేషన్ లో ఒక బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ దగ్గర పనిచేసే ఈశ్వర్, ఓబులేసు అనే ఇద్దరు ఈజీ గా మని సంపాదించేందుకు ఒక ప్లాన్ వేశారు. ఎరుబోతు శ్రావణి అనే కార్పొరేటర్ పేరిట దందా చేయాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా శ్రావణి భర్త ఎరుబోతు రామారావు ఫోటో సంపాదించి ఒక సిమ్ కార్డు క్రియేట్ చేశారు. 52 వ డివిజన్ లో చంద్రశేఖర శర్మ అనే వ్యక్తి అనుమతులు లేకుండా ఒక దేవాలయం నిర్మిస్తున్నట్లు గుర్తించి ఆయనకు ఫోన్ కలిపారు. రెండు లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తాం లేనిపక్షంలో మీ గుడి కూల్చేస్తాం అని బెదిరించారు. కార్పొరేటర్ భర్త రామారావు మాట్లాడతారంటూ ఆయన మాట్లాడినట్లు వార్నింగ్ ఇప్పించారు. అక్కడితో ఆగకుండా కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతారని ఒక మహిళతో మాట్లాడించారు. దాంతో హడలి పోయిన శర్మ ఒక లక్ష రూపాయలు వారు పంపించిన మనిషికి ఇచ్చేశారు. తాను సగం డబ్బే ఇవ్వడంతో భయపడి నేరుగా శ్రావణి దగ్గరకు వెళ్ళి అమౌంట్ తగ్గించాలని బతిమాలాడటంతో అసలు బండారం బయటపడింది. చంద్రశేఖర్ శర్మ చెప్పింది విని శ్రావణి షాక్ కి గురయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కధంతా నడిపిన ఈశ్వర్, ఓబులేసు, వీరిద్దరికి సహకరించిన సంపత్ లను పోలీసులు అరెస్ట్ చేసి శుభం కార్డు వేశారు.

Related Posts