YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 హెలికాప్టర్ మనీతో సాధించొచ్చు : రాహుల్

 హెలికాప్టర్ మనీతో సాధించొచ్చు : రాహుల్

 హెలికాప్టర్ మనీతో సాధించొచ్చు : రాహుల్
న్యూఢిల్లీ, మే 26
కరోనా సంక్షోభ సమయంలో పేదలకు నేరుగా డబ్బులు పంపిణీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు, వలస కూలీలకు కేంద్రం ఎలా అండగా నిలవనుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో పేదలు, వలస కూలీల జీవితం దయనీయంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బు చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే పేదల జీవితాలు మరింత దుర్భర స్థితిలోకి జారుకునే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమలకు కూడా ప్రభుత్వమే అండగా నిలవాలన్నారు. మంగళవారం ( వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.ఈ సంక్లిష్ట సమయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సాయం ఎంతో అవసరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేంద్రం మద్దతు లేకపోతే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు మనుగడ సాగించడం కష్టతరం అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు, వలస కూలీలకు కేంద్రం ఎలా అండగా నిలవనుందో తెలపాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కరోనా సంక్షోభంలో పేద ప్రజలను ఆదుకునేందుకు నేరుగా వారికి నగదు అందిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే.. ఆయా రాష్ట్రాల్లో తమకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం సాయం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు, వలసదారులకు మద్దతు ఇస్తునప్పటికీ.. మన రాష్ట్రాలకు కేంద్రం నుంచి మాత్రం మద్దతు లభించడం లేదు’ అంటూ రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మోదీ, ఆయన బృందం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవానికి అలా జరగడం లేదని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని విమర్శించారు. నాలుగు దశల లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్‌ అని రాహుల్ ఎద్దేవా చేశారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ అమలవుతున్నా దేశంలో కొవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Posts