YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం విదేశీయం

లక్షణాలు లేకపోతే ఇంటికే

లక్షణాలు లేకపోతే ఇంటికే

లక్షణాలు లేకపోతే ఇంటికే
హైద్రాబాద్, మే 26,
లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.  దేశీయ విమానాలు తిరిగి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు ప్రారంభించాయి. కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాలని సూచించాయి. దీంతో తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూశారు.ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా లక్షణాలేవీ లేకపోతే విమాన ప్రయాణికులు 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం విమాన ప్రయాణం చేసిన తర్వాత 14 రోజులపాటు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని సూచించింది.కరోనా లక్షణాలున్న ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుంటే.. వారిని ఐసోలేషన్‌లో ఉంచుతామని... లక్షణాలు ఎక్కువగా ఉంటే కోవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తోన్న హాస్పిటల్‌లో చేర్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా వచ్చిన వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.గర్భిణులు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచుతారు. హోం క్వారంటైన్లో ఉన్న వారందర్నీ ఆరోగ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. వీరిలో కరోనా లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్‌కు తరలిస్తారు.

Related Posts