YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నష్టాన్ని మిగిల్చిన అకాలవర్షాలు

నష్టాన్ని మిగిల్చిన  అకాలవర్షాలు

ఆరుగాలం శ్రమించే రైతన్నకు రెక్కల కష్టం దక్కడం లేదు. ప్రకృతి ప్రకోపంతో శ్రమజీవికి కష్టాలు  తప్పడం లేదు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం రాక, పుట్టెడు కష్టాలతో అల్లాడి పోతుంటే అకాల వర్షాలు చేతికందే పంటను నాశనం చేశాయి. చేసేది లేక దిక్కుతోచని పరిస్ధితిలో రైతన్న దిగాలు చెందుతున్నాడు. ఇప్పుడు ఆరటి పంటను వర్షాలు నేల మట్టం చేయ్యడంతో లక్షలాది రూపాయలు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖజిల్లా మాగుడుల మండలం జాల్లపల్లి గ్రామంలో అరటి తోటలు గాలి వాన భీభత్సానికి నెలకోరిగాయి.  గ్రామంలో వేసిన పంట మొత్తం నాశనం అవ్వడంతో సుమారుగా 30 లక్షల వరకూ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాటిల్లే నష్టాల నుంచి తమను రక్షించాలని అధికారులకు మొర పెట్టుకున్నా వినే నాధుడు కరువయ్యాడు. భారీ నష్టం జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు చేయూతనందించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. పది మందికి సహజసిద్దమైన పంట సంపదను అందించే రైతుకు మాత్రం చివరికి మిగిలేది నష్టమే.  మరోవైపు అకాల వర్షాల ధాటికి కకావికలమైన రైతు జీవన స్ధితి వర్ణణాతీం. మరి ఇప్పటికైనా రైతుల దీన పరిస్ధితిపై అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

Related Posts