YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వైసీపీలోకి టీడీపీ నేతలు

 వైసీపీలోకి టీడీపీ నేతలు

 వైసీపీలోకి టీడీపీ నేతలు
విజయవాడ, మే 27,
రాష్ట్రంలో ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి కీల‌క నేత‌ల‌ను త‌న పార్టీవైపు మ‌ళ్లిస్తున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆచితూచి టీడీపీని దెబ్బ కొడుతున్న విష‌యం తెలిసిందే. చంద్రబాబు కీల‌క కార్య‌క్ర‌మాలు పెట్టుకున్న ప్రతిసారీ అనూహ్యంగా ఆ పార్టీ టార్గెట్ అవుతూనే ఉంది. ఇసుక పై దీక్ష చేప‌ట్టిన‌ప్పుడు, అన్న క్యాంటీన్లపై ఆందోళ‌న చేప‌ట్టిన‌ప్పుడు ఇలా అనేక సంద‌ర్భాల్లో టీడీపీ రైజ్ అవుతున్న ప్రతిసారీ.. వైసీపీ వ్యూహాత్మ ‌కంగా అడుగులు వేసి, ఆ పార్టీ నుంచి నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్రయ‌త్నించి గ‌ట్టి షాక్ లే ఇచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీ పుంజుకునేందుకు ప్రయ‌త్నాలు చేస్తోంద‌న్న ప్రతి సారి అద‌నుచూసి దెబ్బ‌కొట్టిన‌ట్టుగా వైసీపీ స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అన‌ధికారికంగా ఫ్యాన్ గూటికి చేరిపోయారు.ఇప్పుడు కూడా వైసీపీ ఇదే వ్యూహంతో అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం టీడీపీ మంచి మూడ్‌లో ఉంది. ఒక‌వైపు ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురవుతున్న వ్యతిరేక‌త‌లు, ఘాటు వ్యాఖ్యల నేప‌థ్యం. మ‌రోవైపు మ‌హానాడు కార్యక్ర‌మాన్ని నిర్వహించే జోష్‌. ఈ రెండు కూడా టీడీపీకి ఇప్పుడు ఉత్సాహాన్ని పెంచాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌లు వాయిదా వేయ‌డంతో పాటు క‌రోనా నేప‌థ్యంలో జ‌గ‌న్ అనుకున్నవి అనుక‌ున్నట్టుగా జ‌ర‌గ‌డం లేదు. ఇదే టీడీపీలో కాస్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే చంద్ర‌బాబు కూడా విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. దాదాపు రెండు మాసాల త‌ర్వాత హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఏపీలోకి అడుగు పెట్టారు. త్వర‌లోనే మ‌హానాడుకు శ్రీకారం చుట్టారు.ఇంత హ్యాపీ మూడ్‌లో ఉన్న టీడీపీని సైలెంట్‌గా దెబ్బేసేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసింద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు త‌న కుమారుడి భ‌విత‌వ్యం కోసం వైసీపీని ఆశ్రయిస్తున్నార‌నే విష‌యం కొన్నాళ్ల కిందట‌ గుప్పుమంది. అయితే, అప్పటి నుంచి వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చకు ఇప్పుడు ఒక నిర్ణయానికి వ‌చ్చార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా స‌ద‌రు మాజీ మంత్రి వ్యాపారాల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయి. ఈ వ‌రుస దాడుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న స‌ద‌రు మాజీ మంత్రి ఇక టీడీపీలో ఉండి లాభం లేద‌ని.. అటు త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం అయినా పార్టీ మారాల్సిందే అన్న నిర్ణయానికి వ‌చ్చార‌ట‌.ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రితో స‌ద‌రు మాజీ మంత్రి చ‌ర్చలు పూర్తయ్యాయ‌ని.. వీరి జంపింగ్‌కు ముహూర్తం కూడా ఖాయ‌మైంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో అనంత‌పురం నుంచి ఒక కీల‌క నాయ‌కుడు వైసీపీలోకి వ‌స్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది. వీరిని మ‌హానాడు ముహూర్తంగా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి .. చంద్రబాబుకు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని వైసీపీ డిసైడ్ అయిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
 

Related Posts