YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విపరీతంగా పాజిటివ్ కేసులు

విపరీతంగా పాజిటివ్ కేసులు

 

విపరీతంగా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ, మే 27
నాలుగో విడత లాక్ డౌన్ కరోనా వైరస్ ను ఏమాత్రం కట్టడి చేయడం లేదు. రెండు నెలల తర్వాత కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తుంది. భారత్ లో మొత్తం నాలుగు విడతలుగా లాక్ డౌన్ ను విధించారు. మార్చి 24వ తేదీ నుంచి తొలి విడత లాక్ డౌన్ ను ప్రకటించారు. నాలుగో విడత లాక్ డౌన్ మే 31వ తేదీ వరకూ ప్రకటించారు. అయితే తొలి రెండు విడతల లాక్ డౌన్ లో కొంత కంట్రోల్ లోనే ఉన్న కరోనా వైరస్ మూడు, నాలుగు విడతల లాక్ డౌన్ లో మాత్రం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందనే చెప్పాలి.తొలి రెండు విడతల లాక్ డౌన్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ముఫ్ఫయి వేలకు మించలేదు. మరణాలు కూడా వేయి లోపే ఉన్నాయి. మూడో విడత లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రధానంగా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. రెడ్ జోన్ లలోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడంతో మద్యం ద్వారా వచ్చే ఆదాయం పైనే ఆధారపడటంతో దుకాణాలు తెరిచేశారు. మరోవైపు వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా మూడో విడత లాక్ డౌన్ లో చేశారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ లో నమోదవుతున్న అత్యధిక కేసులు వలస కార్మికులవే. వీరందరూ మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. తమిళనాడులోనూ దాదాపు మహారాష్ట్ర నుంచి వచ్చి 87 మంది వలస కార్మికులకు వైరస్ సోకింది.నాలుగో విడత లాక్ డౌన్ అసలు ఏమీ లేదనే చెప్పాలి. రాత్రి పూట కర్ఫ్యూ అన్నది మినహాయించి దాదాపు అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందంటున్నారు. జులై, ఆగస్టు నెలల్లో కరోనా కేసులు భారత్ లో లక్షల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరణాల సంఖ్క కూడా పెరుగుతుందంటున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందితే ఈసారి లాక్ డౌన్ కాదని, షట్ డౌన్ మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు

Related Posts