YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నమ్మకం...నమ్మకం....నమ్మకం....

నమ్మకం...నమ్మకం....నమ్మకం....

నమ్మకం...నమ్మకం....నమ్మకం....
అంతర్మధనంలో చంద్రబాబు
విజయవాడ, మే 27
చంద్రబాబునాయుడుని మాటల మనిషి అంటారు. ఇంకా చెప్పాలంటే లేస్తే మనిషిని కాను అనే టైప్ అంటారు. ఆయన మాటలు కోటలు దాటించేస్తారు. చేతల్లో మాత్రం గడప దాటరు. బస్తీ మే సవాల్, తోకలు కట్ చేస్తాను లాంటి రొటీన్ డైలాగులు బాబు గారికి అలవాటు. కానీ ఆయనదంతా తమ్ముళ్లను ఎదుట పెట్టుకుని ఊగిపోయే ఆవేశమే తప్ప నిజానికి ఆయన ఎవరినీ ఏమీ గట్టిగా అనలేరు అన్నది అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబు వీలున్నంతవరకూ ఘర్షణకు దూరంగా ఉంటారు. ఎదుటివారిని తనకు అనుకూలం చేసుకోవాలనుకుంటారు. తన కొంప మునిగినపుడు మాత్రమే అతనికి ఎవరైనా శత్రువులు అవుతారు, తప్ప మాములుగా అయితే పట్టించుకోరు. ఇదీ చంద్రబాబు నలభయ్యేళ్ళ రాజకీయం చూసిన వారు ఆయన గురించి ఏర్పరచుకున్న అభిప్రాయం.దేశానికి ప్రధాని అయిన మోడీతో చంద్రబాబుకు ఆభిజాత్యపు గొడవలే ఉన్నాయి. మోడీ తనకంటే జూనియర్ అన్న భావన చంద్రబాబులో బాగా ఉంది. పైగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన పదవిని గాలిలో దీపంలా చేయడంతో నాటి ఎన్డీయే కూటమిలో అతి ముఖ్య భాగస్వామిగా తాన డిమాండ్ కీలక భూమిక పోషించిందని చంద్రబాబు గట్టిగా నమ్ముతారు. ఇక రోజులు మారి మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. ఆయనతో చేతులు కలిపి చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు. అయితే చంద్రబాబు తన మనసులో మాత్రం మోడీ తనకంటే తక్కువ అన్న భావనతో ఉండిపోయారు. అలా ముదిరిన భావనకు రాజకీయాలు తోడై మోడీనే ఢీ కొట్టాల్సి వచ్చింది. దాంతో మోడీతో వియ్యం కాస్తా కయ్యంగా మారింది. ఆ తరువాత ఎన్నికల్లో ఘోర పరాభవంతో బాబుకు వాస్తవాలు తెలిసివచ్చినా మోడీని ప్రాధేయపడుతున్నా కూడా ఆయన అసలు చంద్రబాబు మాట అసలు వినడంలేదు. చంద్రబాబుని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు.ఇక కేసీఆర్ సైతం చంద్రబాబు శిష్యుడే. ఆ భావన కూడా బాబుకు ఇప్పటికీ ఉంది. అయితే తెలంగాణా ఉద్యమం కేసీఆర్ ని తిరుగులేని నేతను చేసింది. ఎంతలా అంటే చంద్రబాబు సైతం ఆయన ముందు రాజకీయ‌ మరుగుజ్జు అయ్యేంతలా. ఆ తరువాత రెండు రాష్ట్రాలకు ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. అయినా చంద్రబాబుకు తెలంగాణా మీద ఆశ పోలేదు, దాంతో ఆడిన ఓటుకు నోటు ఆట వికటించి ఏకంగా ఏపీకి తట్టా బుట్టా సర్దుకోవాల్సివచ్చింది. ఆ తరువాత గమ్మునున్న చంద్రబాబు 2018 ఎన్నికల టైంలో కాంగ్రెస్ లో కలసి కేసీఆర్ ను ఓడించాలని చూశారు. ఇలా రెండు సందర్భాల్లో కేసీఆర్ తో నేరుగా ఢీ కొట్టి ఓడిపోయారు. ఇపుడు ఆయన్ని ఒక్క మాట కూడా చంద్రబాబు అనకుండా మౌనం వహిస్తున్నా కూడా కేసీఆర్ కనికరించడంలేదు సరికదా కోరి మరీ కెలికి నిందిస్తున్నారు. నిజానికి పోతిరెడ్డిపాడు ఎత్తు పెంపు మీద చంద్రబాబు కనీసం ఒక్క మాట కూడా తెలంగాణాకు యాంటీగా మాట్లాడలేదు, కానీ సీన్ లోకి తెచ్చి మరీ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారంటే చంద్రబాబుని అసలు వదలను అంటున్నట్లే లెక్క.ఇపుడు చంద్రబాబు ఇదే పాడుకోవాల్సివస్తోందిట. నమ్మరే… నేను మారానంటే నమ్మరే అని దీనంగా బాబు పాడుతున్నా అటు కేసీఆర్ కానీ, ఇటు మోడీ కానీ అసలు ఉలకడంలేదు, పలకడంలేదు. వారికి చంద్రబాబు అంటే ఏంటో పూర్తిగా తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం చంద్రబాబు అని భావించబట్టే మోడీ, కేసీఆర్ అసలు చంద్రబాబుని ఖాతరు చేయడంలేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ నుంచి మోడీని, కేసీఆర్ ను విడదీసి ఆ కొత్త రాజకీయ సమీకరణల్లో తాను గరిష్టంగా లాభపడదామననుకంటే అది ఎప్పటికీ కుదిరేలా లెదు నిజానికి చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత వారిద్దరికీ జగన్ ని మరింతగా దగ్గర చేస్తోందని అంటున్నారు.

Related Posts