YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఎట్టకేలకు పూర్తయిన నిశ్శబ్దం

ఎట్టకేలకు పూర్తయిన నిశ్శబ్దం

ఎట్టకేలకు పూర్తయిన నిశ్శబ్దం
హైద్రాబాద్, మే 27
అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మార్చి‌ నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. థియేటర్లు మూతబడటంతో ‘నిశ్శబ్దం’తో పాటు అన్ని సినిమాల విడుదలలు ఆగిపోయాయి.
అయితే, ‘నిశ్శబ్దం’ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఆ మధ్య వదంతులు వచ్చాయి. వీటిని నిర్మాత కోన వెంకట్ ఖండించారు. అయినప్పటికీ కొంత మందిలో ఎక్కడో అనుమానాలు. అలాంటి వాటిని కూడా ఇప్పుడు చెరిపేశారు నిర్మాతలు. ఎందుకంటే, ఈ సినిమా మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన హేమంత్ మధుకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.‘‘మా రెండు సినిమాలు ‘నిశ్శబ్దం’ తెలుగు, ‘సైలెన్స్’లకు యు/ఎ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ బోర్డు సభ్యులు స్పందన చూసి నాకెంతో ఆనందం వేసింది. ఈ సినిమాను థియేటర్‌లోనే తొలుత విడుదల చేయాలని వారు ఇచ్చిన సలహాకు నా కృతజ్ఞతలు’’ అని మధుకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తానికి థియేటర్‌లోనే విడుదల అవుతోన్న అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.
 

Related Posts