YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 ఫిట్ నెస్ లో విరాట్... సూపర్

 ఫిట్ నెస్ లో విరాట్... సూపర్

 ఫిట్ నెస్ లో విరాట్... సూపర్
ముంబై, మే 27
ఫిట్‌నెస్ విషయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత శ్రద్ధ తీసుకుంటాడో..? అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన విరాట్ కోహ్లీ.. మ్యాచ్‌లు లేకపోయినా జిమ్‌లో మాత్రం రెగ్యులర్‌గా చెమటోడ్చుతూ కనిపిస్తున్నాడు. ఇక జూన్ నుంచి మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా.. దొరికిన ఈ బ్రేక్ టైమ్‌లో కోహ్లీ ఫిట్‌నెస్ మరింత మెరుగుపడినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ జిమ్‌లో బరువులు ఎత్తుతూ సహచర ఆటగాళ్లకి సవాల్ విసిరిన విరాట్ కోహ్లీ.. తాజాగా క్లిష్టతరమైన 180 డిగ్రీ ల్యాండింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కాలి మడమపై శరీరం బరువు మొత్తాన్ని మోపి.. ఆ తర్వాత 180 డిగ్రీ కోణంలో గాల్లోకి ఎగిరి మళ్లీ ఒంటి కాలి మడమపై ల్యాండ్ అవడం చాలా కష్టం. ఈ క్రమంలో.. సరైన ప్రాక్టీస్ లేకపోతే గాయపడే ప్రమాదాలు లేకపోలేదు. ముఖ్యంగా.. అథ్లెట్స్‌కి పాత మడమ గాయాలేమైనా ఉంటే..? అవి తిరగబడే ఛాన్స్ ఉంది. అందుకే.. ఈ ల్యాండింగ్‌ని టాప్ ఎక్సర్‌సైజ్‌గా కోహ్లీ అభివర్ణించాడు.కరోనా వైరస్ కారణంగా దాదాపు మూడు నెలలు క్రికెటర్లు ఇంటికే పరిమితమవడంతో.. వాళ్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే ముందు కనీసం నెల రోజులు ప్రాక్టీస్ సెషన్ అవసరమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ మాత్రం తాను ఎక్కడ ఆపానో..? అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టగలనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

Related Posts