భర్త, ప్రియురాలిని చితకబాదిన భార్య
వరంగల్ మే 27,
భార్య ఉండగానే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ప్రియురాలి ఇంట్లో భార్య పట్టుకోని దేహశుద్ది చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా పోతన నగర్ లో నివాసం ఉంటున్న భార్య భర్తలు తులసి, శ్రీనివాస్ లకు పెళ్లి అయి పది సంవత్సరాలు ఆవుతుంది. అయితే వారిద్దరికి తరుచూ గొడవలు వస్తున్నాయి. భార్య తులసి ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తుంది. భార్య సంపాదన మిద బతుకే వాడని భార్య అంటోంది. రెండు నేలల నుండి ఇంటికి రాకపోవడంతో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పక్క సమాచారం తో బీట్ బజార్ లోని నివాసం ఉంటున్న ప్రియురాలి ఇంట్లో రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ప్రియురాలు, భర్త శ్రీనివాస్ లకు దేహశుద్ది చేసి స్థానిక ఇంతార్ గంజ్ పోలిసు స్టేషన్లో అప్పచేప్పారు. నాకు న్యాయం చేయాలని తులసి ఫిర్యాదు చేసింది.