డిమాండ్ ఉన్న పంటలు పండించాలి
- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
పెద్డపల్లి, మే 27
మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంట సాగుచేయడం వల్ల రైతులకు అధిక లాభం చేకురుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎలిగేడు మండల కేంద్రంలో, పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో గత సంవత్సరం 20% మేర సన్నరకాల ధాన్యం పండించారని, ప్రస్తుత వానాకాలంలో 40% మేర సన్నరకాల ధాన్యం 1309 ఎకరాలలో సాగుచేయాలని, గత వానాకాలంలో 12 ఎకరాలో వేసిన మొక్కజోన్న పంట స్థానంలో కందులను పండించాలని కలెక్టర్ సూచించారు. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేస్తు రైతు బంధు సాయం, పంటకు గిట్టుబాటు ధర రైతులంతా పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేసారు. రైతు బంధు పథకం పై అనవసర అపోహలు ప్రచారం అవుతున్నాయని, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ నియంత్రిత పద్దతిలో సాగు చేసె ప్రతి ఒక్కరికి రైతు బంధు సాయం అందుతుందని కలెక్టర్ స్పష్టం చేసారు. రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా రైతులందరికి మంచి లాభాలు రావాలనే ఉద్దేశ్యంతో మాత్రమే నియంత్రిత సాగు అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. 5 వేల ఎకరాలను ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించిందని, క్లస్టర్ వారిగా నియంత్రిత వ్యవసాయ సాగు లక్ష్యాలను సాధించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో గత ఏడాది మాదిరిగానే సాగు జరుగుతుందని, మొక్కజోన్న పంటను నిరుత్సాహపరుస్తు పత్తి, కందుల సాగు ప్రోత్సహించాలని, 45% మేర సన్నరకం ధాన్యం సాగు చేసేలా రైతులు ముందుకు రావాలని ఆమె కోరారు. మన రాష్ట్రంలో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రైస్ మిల్లులు ఉన్నాయని, ఉత్పత్తి గత సంవత్సరం 3 కోట్ల మెట్రిక్ టన్నులు వచ్చిందని, ప్రతి సంవత్సరం మొత్తం పంట ప్రభుత్వం కొనుగొలు చేయడం సాధ్యం కాదని కలెక్టర్ తెలిపారు. సన్నరకాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, వీటిని పండించడం వల్ల రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందని, మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రుపొందించిన తెలంగాణ సోనా రకం వల్ల షుగర్ వ్యాధి నివారణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం వల్ల మంచి ధర లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. సన్నరకం ధాన్యం సాగు సమయంలో రైతులకు ఎదురయ్యే సందేహలను నివృత్తి చేస్తామని, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ లక్ష్యాల సాధన దిశగా చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మన జిల్లాలో 100% రైతులు నియంత్రిత పద్దతిలో సాగు చేస్తు రైతు బంధు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కజోన్న పంటను వానాకాలంలో సాగు చేస్తే వచ్చే నష్టాలను కలెక్టర్ వివరిస్తు వాటి స్థానంలో పత్తి, కందులు సాగు చేయాలని కోరారు. సన్నరకం ధాన్యంలో అధిక దిగుబడులు వచ్చే విత్తనాలు వివరాలు, సాగు అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం పై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులొ ఉంచుతున్నామని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వానాకాలం సాగు పనులు ప్రారంభించుకోవాలని కలెక్టర్ కోరారు. రైతులు పండించే సన్నరకం ధాన్యాన్ని మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగొలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఎలిగేడు మండల పరిధిలో జూనియర్ కళాశాల , పోలిస్ స్టేషన్, మాడల్ స్కూల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపిపి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా హర్టికల్చర్ అధికారి జ్యోతి, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.